ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాలి

0
4

ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని జగన్నాథపురం, కోమటిపల్లిలో మంగళవారం పన్ను వసూళ్లను పరిశీలించారు.

ప్రతి ఇంటికి వెళ్లి పన్ను వసూలు చేసి ఆన్లైన్ రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. పన్ను లేని ఇళ్లను గుర్తించి పన్నులు వేయాలన్నారు.

#Boiena Rajesh