కురబలకోటలో విషాదం.. న్యాయం కోసం వృద్ధురాలి పోరాటం.

0
0

కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ అనే వృద్ధురాలు, తన సవతి కొడుకు కృష్ణప్పపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

తాను ఇంట్లో లేని సమయంలో కృష్ణప్ప ఇంటి పత్రాలు, నగదు, బంగారాన్ని అపహరించడమే కాకుండా, తనను ఇంట్లో నుంచి గెంటేసి వీధిపాలు చేశాడని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తనకు న్యాయం చేసి, తన ఆస్తి పత్రాలను తిరిగి ఇప్పించాలని ఎస్పీని వేడుకున్నారు.