కురవంకలో కలకలం.. బాధితురాలు ఆసుపత్రిలో చేరిక.

0
0

మదనపల్లె పట్టణంలోని కురవంక ప్రాంతంలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలు తన ఇంటి ముందు ముఖం కడుక్కుంటుండగా, అదే వీధికి చెందిన ప్రకాశ్, చంద్రకళ దంపతులు ఆమెతో గొడవకు దిగారు. భాగ్యమ్మ ఉమ్మి వేయడం తమను ఉద్దేశించి చేసిందేనని భావించిన ఆ దంపతులు, ఆగ్రహంతో ఆమెపై కుర్చీతో పైశాచికంగా దాడి చేశారు.

ఈ దాడిలో భాగ్యమ్మ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మదనపల్లె వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.