నిజామాబాద్‌లో కామదహన వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే ధనపాల్.

0
0

నిజామాబాద్ నగరంలో హోలీ వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి నగరంలోని వివిధ చౌరస్తాల్లో నిర్వహించిన కామదహనం (హోలికా దహనం) కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన హోలికకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంటలను వెలిగించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఎమ్మెల్యేతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.