మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 39 మందికి స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అహ్మద్ మొయినుద్దీన్ తలా రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 3.90 లక్షల జరిమానా విధించారు.
వీరిలో నేరం తీవ్రతను బట్టి ఐదుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ వివరాలను నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రభా ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.










