మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం

0
1

మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పిరిడి గోకుల్ కళాశాలలో మంగళవారం మత్తు పదార్ధాలు, గంజాయి వలన కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అయిన వారందరి కుటుంబాలు నాశనం అయ్యాయాన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
#Boiena Rajesh