మదనపల్లి: మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ.

0
1

విధి నిర్వహణలో అకాల మరణం చెందిన కేవీ పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఆయన సతీమణి చంద్రకళకు కారుణ్య నియామక పత్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ సోమవారం మదనపల్లిలో అందజేశారు.

బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. సకాలంలో నియామక పత్రం అందజేసినందుకు హోంగార్డు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, ఆర్‌ఐ పెద్దయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.