విశాఖను ఐటీ హబ్‌గా మార్చే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్, క్యాప్‌జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో సమావేశమయ్యారు. సుమారు 20 వేల మందికి ఉద్యోగాలిచ్చేలా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీలో భాగస్వామ్యం కావాలని కోరారు. దీనిపై క్యాప్‌జెమినీ సీఈవో సానుకూలంగా స్పందిస్తూ, ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్ తరహాలోనే క్యాప్‌జెమినీ రాకతో విశాఖ ఐటీ రంగం మరింత విస్తరించనుంది.
