చారిత్రక మాదన్న పేట మార్కెట్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు: పార్కింగ్ స్థలం కబ్జా.. ప్రయాణికుల అవస్థలు!

0
0

సైదాబాద్‌లోని చారిత్రక మాదన్న పేట మార్కెట్‌కు నిత్యం వేలమంది వస్తుంటారు. వ్యాపారులు కూరగాయల వ్యర్థాలను పార్కింగ్ స్థలంలో వేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పారిశుధ్య పనులు అసంపూర్తిగా సాగుతుండటంతో కంపు కొడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆ వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసేలా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.