*హైదరాబాద్*
*అత్తాపూర్ లో ప్రభుత్వ భూమి కాపాడలంటూ స్థానిక ప్రజల ఆందోళన..*
*ఆందోళన జరుగుతుండగానే సడెన్ ఎంట్రీ ఇచ్చిన హైడ్రా చీఫ్ రంగనాథ్…స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..*
*హైడ్రా నే న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన*
అత్తాపూర్ రాంబాగ్ లోని 354/2, 354/4 వరకు గల సర్వే నెంబర్ లోనీ భూమిని ఒక వర్గం వాళ్లు 100 నుంచి 200 వ్యక్తులు ఒక్కరోజులో చుట్టూ రేకుల షెడ్ వేసి కబ్జా చేశారు.
ఆర్డిఓ ఆఫీస్ కి 100 మీటర్ల, దూరంలో, పోలీస్ స్టేషన్ కి అర్థ కిలోమీటర్ దూరంలో, జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్ కి 10 మీటర్ల దూరంలో, ఎండోమెంట్ ఆఫీస్ కి 50 మీటర్ల దూరం లో ఉన్న ఈ స్థలాన్ని సిక్క్ చావుని గురుద్వారా కి సంబంధించిన 100 నుంచి 200 మంది వ్యక్తులు కబ్జా చేశారు.
అధికారుల ప్రోద్బలం తో నే ఈ కబ్జా జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ కబ్జా విషయంపై కలెక్టర్,ఎమ్మార్వో,ఆర్డీఓ,పోలీసులకు స్థానికులు పిర్యాదు చేయగా రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు…మూడు రోజులు గడుస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు (బుధవారం)
స్థానికంగా ఉన్న అత్తాపూర్ రామ్ బాగ్, హైదర్ గూడ పాండురంగ నగర్ ఉప్పరపల్లి తోపాటు పలు కాలనీవాసులు కలసి కబ్జాకు గురైన స్థలం వద్దే ధర్నాకు దిగారు..
విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు, రాజేంద్రనగర్ MLA ప్రకాష్ గౌడ్ ఆందోళన చేస్తున్న స్థలానికి సడెన్ గా వచ్చారు. రెండు వర్గాలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడే బాధ్యత మాది అని ఆందోళన చేపట్టిన ప్రజలకు హామీ ఇచ్చారు.త్వరలోనే వీటిపై చర్యలుంటాయని ఆయన అన్నారు…ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆందోళన చేసిన ప్రజలను ఎమ్మెల్యే ప్రశంసించారు..ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కాపాడుకుంటుదని..చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే అన్నారు..




