సంతానానికి 2 నెలల సెలవు.. మరిన్ని వరాలు!

0
0

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం కీలక సంక్షేమ పథకాలను ప్రకటించింది. జనాభా వృద్ధిని ప్రోత్సహిస్తూ మూడో సంతానానికి పురుష ఉద్యోగులకు 2 నెలల పితృత్వ సెలవులు, రెండో బిడ్డకు ₹25 వేల ప్రోత్సాహకం, మరియు రాయితీతో IVF చికిత్స అందించనుంది. మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ కేర్ సెంటర్లు, హాస్టళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, పదవీ విరమణకు ముందు 15 రోజుల వెల్‌నెస్ లీవ్ మరియు ₹50 వేల ఆరోగ్య సహాయాన్ని ఖరారు చేసింది.