గ్యాస్‌ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు

0
9

రూ. 3,500 నుంచి 4 వేలు
హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రూ. 4 వేల వరకు ధర పలుకుతోందని సమాచారం.

సాధారణంగా రూ.2105 వరకు ఉండే 19 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. సరఫరా లేకపోవడంతో పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడుతున్నాయి. మహమ్మద్‌గూడా, పద్మారావునగర్‌, అఫ్జల్‌గంజ్‌, బేగంబజార్‌, కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీ వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. చిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.