హైదరాబాద్: 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయం గణనీయంగా పెరిగింది. నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా మొత్తం రూ.1,172.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,138.44 కోట్ల ఆదాయం నమోదు కాగా, ఈసారి అదనంగా రూ.34.36 కోట్ల వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ద్వారా అనుమతులు, సర్టిఫికెట్లు జారీ చేయడం ఆదాయం పెరగడానికి దోహదపడింది.
2025 మార్చి నెలలోనే 15,536 నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. నగర అభివృద్ధి వేగం పెరుగుతున్న దానికి ఇది స్పష్టమైన సంకేతంగా అధికారులు పేర్కొన్నారు.
అదే సమయంలో క్యూర్ అర్బన్ రీజియన్‌లో ఆస్తి పన్ను వసూళ్లు కూడా భారీగా నమోదయ్యాయి. మొత్తం రూ.2,558.8 కోట్ల పన్ను వసూలు కాగా, జీహెచ్ఎంసీలో రూ.995.82 కోట్లు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.100.36 కోట్లు, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.562.62 కోట్లు వసూలయ్యాయి.
మార్చి నెలలోనే రూ.453 కోట్ల బకాయిలు వసూలు చేయగా, మార్చి 31 ఒక్కరోజే రూ.162.94 కోట్ల ఆదాయం నమోదు కావడం విశేషం. ఈ వసూళ్లు నగర ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తున్నాయి.
#sidhumaroju
Alwal










