దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో యస్ ఐ ఆర్ మ్యాపింగ్ క్యాంప్.

0
9

తేది 04-04-2026, శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, స్థానిక సయ్యద్ నబీ మస్జిద్ సమీపంలో, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ, పెద్దపల్లి ఆధ్వర్యంలో, పెద్దపల్లి మండల రెవెన్యూ అధికారి  సమన్వయంతో, పోలింగ్ స్టేషన్ సంఖ్యలు 58, 59, 60 మరియు 61 కు చెందిన బి.ఎల్.ఓలు, అలాగే 9 మరియు 28 వార్డు కౌన్సిలర్ల సహకారంతో యస్.ఐ.ఆర్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించబడినది.

ఇట్టి కార్యక్రమంలో 9 మరియు 28 వ వార్డు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మ్యాపింగ్ చేయించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 9వ వార్డు మరియు 28వ వార్డు కౌన్సిలర్లు నదీమ్. మరియు తూముల లత సుభాష్. హాజరయ్యారు.

వీరితోపాటు జి పి ఓ శ్రీ రాధా, బి ఎల్ ఓ లు సుమాంజలి, రజిత, ఉమా, స్రవంతి, శ్రీదేవి మరియు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ, పెద్దపల్లి స‌భ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.