వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య,పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణ ఎంతో అవసరమని,అది జీవితములో చక్కటి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు.తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించిన నాడే ఆదర్శ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడని తెలిపారు. చదువుతోపాటు వివిధ పోటీలలోనూ, క్రీడారంగములోనూ రాణించాలని,తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలతో పాటు వారి చదువుల పట్ల కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతో ఉందని తెలిపారు. చదువు అనేది దొంగతనం చేయని వస్తువు లాంటిదని,చదువుకు వయస్సు నిమిత్తం లేదని, పేదరికంతో జీవించేవారు కూడా చక్కటి చదువును అనుభవించిన దాఖలాలు కలవని తెలిపారు. గురు శిష్యుల అనుబంధంతోనే మంచి మార్గంతో కూడిన చదువు లభిస్తుందని,చదువులో బాగా రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, జీవితంలో సాధించాలన్న తపన ఉండాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పొగడదండ రవి కుమార్,పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










