Sidhu Maroju
Sidhu Maroju

Sidhu Maroju

      |      

Subscribers

   Liked videos

Sidhu Maroju
15 Views · 3 hours ago

సికింద్రాబాద్... మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరి గూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని నిన్న రాత్రి ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగంతకులు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు. ఆలయం వద్దఉద్రిక్త పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.

Sidhu Maroju
9 Views · 1 day ago

నగర నలుమూలల నుంచి దేవాలయానికి వస్తున్న భక్తులు స్వామివారికి తమ వంతు విరాళాలు అందజేయడం సంతోషకరమని కంటోన్ మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్అన్నారు. న్యూ బోయిన్ పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు జంపన ప్రతాప్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం న్యూ బోయిన్ పల్లి కి చెందిన యుగంధర్ రెడ్డి, శైలజ, శృతి, అజిత్, ప్రవీణ్ కుమార్, మరియు సంధ్యారాణి స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన కంటె ఆభరణాన్ని జంపనకు అందజేశారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు సమర్పించిన కంటే ఆభరణాన్ని స్వామివారికి అలంకరింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, యాదయ్య, జగన్నాథం, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Sidhu Maroju
4 Views · 2 days ago

నవరాత్రి పర్వ దినాలు చివరకు దశకు చేరాయి. ఎక్కడ చూసిన దసరా కోలాఫలమే. భారతావనిలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. దసరా లేదా... విజయదశమి, చెడు పైన మంచి సాధించిన విజయానికి సంకేతంగా శ్రీరాముడి చేతిలో రావణుడి సంహారం దసరా దశమి నాడే జరిగిందని హిందువులు నమ్ముతారు. విజయానికి సంకేతంగా హిందువులు జరుపుకునే అతి గొప్ప పండగ దసరా. ఈ సందర్భంగా అల్వాల్ లోని పలు కాలనీలలో దసరా వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

Sidhu Maroju
21 Views · 4 days ago

అల్వాల్ సర్కిల్ ఖానాజీగూడ లో కృష్ణ ఎంక్లేవ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అమ్మవారికి ఈటల రాజేందర్ శాస్త్రోచ్చకంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈటెలను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... అమ్మవారి దర్శనం తనకు చాలా ఆనందం కలిగించిందన్నారు. ఇలా ప్రతి ఏట నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ప్రజలందరిపై అమ్మవారి దయ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎంపీ సింగ్, మురళీకృష్ణ, సుజిత.. తదితరులు పాల్గొన్నారు.

Sidhu Maroju
13 Views · 5 days ago

అల్వాల్ జిహెచ్‌ఎంసి నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఉద్యోగులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో మునిగితేలారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వెంకట్, ఈ శ్రీకాంత్. ఏ ఎమ్హెచ్ ఓ రజని. సిబ్బంది పాల్గొన్నారు.

Sidhu Maroju
21 Views · 6 days ago

బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ. చెరువుకు... బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉంది.
బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువులను కాపాడుకుందాం. చెరువులను పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉంది.


హైదరాబాద్ నాంపల్లి లోని టీజీవో భవన్ లో టీజీవో కేంద్ర సంఘం ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో మంత్రి సీతక్క పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.... మనకు పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారం..సంస్కృతి బతుకమ్మ. బతుకును ఇచ్చే బతుకమ్మను భవిష్యత్తు తరాలకు ఈ పండుగను అందించడమే మన బాధ్యత. ఈరోజు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. చెరువులను కబ్జాల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చెరువులకు పూజలు చేసే బతుకమ్మ పండుగ. తెలంగాణ అంటేనే చెరువులు.. బతుకమ్మ పండుగ. గతంలో మన జీవనశైలి చెరువుల పైనే ఆధారపడి ఉండేది. చెరువులలోనే నీరు తాగేది, చెరువుల ద్వారానే పొలాలకు నీరు అందించేది.. హైదరాబాద్ కు లేక్ సిటీ అనే పేరు ఉండేది. కానీ ఈరోజు అవి కనుమరుగయ్యాయి. ఆటలు...పాటలు బతుకమ్మకు పూజలు.. ఈ సంస్కృతి తరతరాలకు అందించే బాధ్యత మన పైన ఉందని పేర్కొన్నారు.

Sidhu Maroju
28 Views · 8 days ago

హైద్రబాద్ మెట్రో రైలు ని మేడ్చల్ మరియు షామీర్ పేట వరకు పొడిగించాలని సుచిత్ర వద్ద చేస్తున్న ధర్నా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు అత్యంత అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, షామీర్ పేట వరకు జూబ్లీ బస్టాండ్ నుండి మెట్రో రైలు మార్గాన్ని పొడగించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారం అందేలా చూసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా ఐటి ఉద్యోగులు అత్యధికంగా ఉన్న ప్రాంతంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, ఈ ఇబ్బంది దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి రైలు మార్గాన్ని పొడిగించే దిశగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కార్యదర్శి భరత్ సింహారెడ్డి, రాజు రెడ్డి, సతీష్ రంగంపేట. పత్తి సతీష్, పులి బలరాం, నల్లి జయశంకర్ గౌడ్, శేఖర్ యాదవ్, శ్యామ్ కిరణ్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sidhu Maroju
32 Views · 10 days ago

అల్వాల్ ల్లో బతుకమ్మ సంబరాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా.. రెండో రోజు అటుకుల బతుకమ్మతో మహిళలు ఆడి పాడారు. రెండో రోజు బతుకమ్మను రెండు పూల వరసలతో పేర్చిన మహిళలు, అశ్వయుజ శుద్ధ విదియ అయిన నేడు మూడో రోజు. మూడు పూల బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా మూడు వరుసలతో పేర్చి సంబరాలు అంబరాన్ని అంటేలా అల్వాల్ కొత్తచెరువు వద్ద మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మి కాంత్ రెడ్డి విచ్చేసి సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sidhu Maroju
62 Views · 11 days ago

భవన నిర్మాణాలకు అనుమతులు, నిర్మించేది వ్యాపార సముదాయాలు.
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు.

అల్వాల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతున్న వాటిని నివారించే మున్సిపల్ శాఖ అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని పనులు ప్రారంబిస్తారు. గృహావసరాల పేరుతో అనుమతులు పొంది అటు తరువాత వ్యాపార సముదాయాలుగా మార్చుకుంటున్నారు. నిర్మాణ అనుమతులు ఇచ్చిన అనంతరం జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లేక పోవడంతోపాటు సంబంధిత అధికారులను మేనేజ్ చేసుకుంటూ నిర్మాణదారులు వారి పని కానిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టడం లేకపోవడంతో ఇదే తరహాలో ఇతరులు సైతం రెచ్చిపోతున్నారు. కమర్షియల్ అనుమతులు పొందాలంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి, అగ్ని మాపక దళం అనుమతి, విద్యుత్ శాఖ అనుమతి అవసరం. కానీ వీటన్నిటిని ఒకే చోట కలిపి సదరు భవన నిర్మాణదారులు ఒకేసారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. వీరికి అధికారుల అండదండలు ఉండటంతో యదేచ్చగా నిర్మాణాలు జరుపుతున్నారు.

Sidhu Maroju
55 Views · 12 days ago

ఆల్వాల్: వెంకటపురం శ్రీ పోచమ్మ టెంపుల్ ల్లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. మహాలయ అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మ సంబరాలు, ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు ఈ పండుగ వేడుకలో ఒక్కరోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు.. రోజు ఒక్కోరకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ అంటారు. చివరి రోజు జరుపుకునే పండుగను సద్దుల బతుకమ్మ అంటారు.

Sidhu Maroju
20 Views · 12 days ago

మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ సర్కిల్ 133వ డివిజన్ మచ్చ బొల్లారంలో డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో గాంధీ 155 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మైనంపల్లి మాట్లాడుతూ.. అహింసా మార్గం ద్వారా ఏదైనా సాధించవచ్చని మనం గాంధీ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా పారిశుద్ధ కార్మికులను మైనంపల్లి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం కాంటెస్ట్ కార్పోరేటర్ టిఎన్ సంజీవ్ కుమార్, రాష్ట్ర ఓబిసి నాయకులు చిత్రాల సంతోష్ సాగర్. మహిళ నాయకురాలు..శకుంతల నాయుడు, పద్మ, మరియు కాంగ్రెస్ నాయకులు సాయికుమార్, కేబుల్ కిట్టు, నందకుమార్, నిరంజన్, సుధీర్, రాజ్ కుమార్, కిరణ్, అంకుల్ విష్ణు, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhu Maroju
16 Views · 12 days ago

పారిశుద్ధ కార్మికులను కార్మికులను సన్మానించిన జంపన ప్రతాప్. నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస బాటలో నడవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ సూచించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ వద్ద కంటోన్ మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. అహింసే ఆయుధంగా ఆంగ్లేయులను గడగడలాడించి స్వాతంత్రం తెచ్చిన ఘనత మహాత్మా గాంధీకే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన అహింస మార్గంలోనే నడవాలని కోరారు. స్వచ్ఛ హి సేవ గాంధీ జయంతి సందర్భంగా బోయిన్ పల్లి సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ సిబ్బందిని జంపన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభు కుమార్ గౌడ్. మాల్యాద్రి. సాయిబాబా యాదవ్. బండిశ్రీను. ముఖేష్. వర ప్రసాద్. సిరాజ్. కుమార్. మధు. మౌలా. షకీబ్.సత్యనారాయణ. మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhu Maroju
14 Views · 17 days ago

సికింద్రబాద్ కంటోన్మెంట్ 6 వ. వార్డు న్యూ బోయిన్పల్లి లోని రామన్న కుంట చెరువు వద్ద కంటోన్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమము నిర్వహించారు. ఇందులో భాగంగా కంటోన్ మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యులు.. పాండు యాదవ్, బీజేపీ నేత బి.ఎన్ శ్రీనివాస్ తో పాటు రక్షణ శాఖ దక్షిణ కమాండ్ డైరెక్టర్ అమూల్ ,బి..జగ్దాప్, కంటోన్ మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్, జాయింట్ సీఈవో పల్లవి విజయ వంశీ, హెల్త్ సూపరిండెంట్ దేవేందర్. సానిటరీ సూపరిండెంట్ మహేందర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ...బోర్డు అధికారులు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రజలను భాగస్వామ్యం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలు బోర్డు అధికారులకు సహకరిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలని చెత్తను రోడ్డుపై గాని, ఖాళీ స్థలాల్లో కానీ పారవేయవద్దని సూచించారు.

Sidhu Maroju
10 Views · 18 days ago

దొరల భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి భూపోరాటం చేసిన వీరవనిత అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయిన్ పల్లి రజక సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద చాకలి ఐలమ్మ 129 వ జయంతి కార్యక్రమం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ... దొరలు అన్ని విధాల తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన ధైర్య సాహసాలతో అప్పటి ఆంధ్ర మహాసభ నాయకులతో కలిసి దొరల భూములను పేదలకు పంచిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. పోరాట స్ఫూర్తిగా నిలిచిన ఆమె ఆశయాలు ఆదర్శనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వి. ఆర్. ఎండి. నందకిషోర్, రజక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, నర్సింగ్ రావు, యాదగిరి, బాలరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

Sidhu Maroju
7 Views · 19 days ago

నార్త్ హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చింది మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. ఈ ప్రముఖ అతిథిగా వర్త జయసుధ, మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ... తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజీలో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ సహజనటి జయసుధ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరం అన్నారు. మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన చికిత్స అందించడమే మా లక్ష్యం అని, మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల స్పెషల్ సర్జన్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సిలబస్ తో కొత్త కోర్సులను కూడా అందుబాటులోకి తెస్తామని కాలేజీ యాజమాన్యం ఇచ్చింది .

Sidhu Maroju
23 Views · 21 days ago

బేగంపేట ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల నుండి నాలుగు లక్షల విలువైన నకిలీ మద్యాన్ని 180 మద్యం బాటిళ్లు మూతలు స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీ గోవా ప్రాంతాల నుండి మద్యాన్ని తీసుకువచ్చినట్టు నమ్మిస్తూ విక్రయిస్తున్నట్టు విచారణలో తెలింది. ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగన్నాథ సాహులు.. ఈవెంట్లకు మద్యాన్ని సరఫరా చేసే వారని తెలిపారు. ఖరీదైన మద్యం బాటిల్లలో మద్యం ఖాళీ అయిన వెంటనే ఆ ఖాళీ బాటల్లను ఇళ్లకు తీసుకువెళ్లి అందులో నకిలీ మద్యాన్ని పోసి తక్కువ ధరకే వినియోగదారులకు అమ్ముతున్నట్టు తేలింది. ఈవెంట్లు జరిపే వాళ్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు విచారణ లో తేలింది. మరియు వినియోగదారుల నుండి ఆర్డర్లు తీసుకుని వాటిని తక్కువ ధరలకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఈ నకిలీ మద్యాన్ని తరలిస్తున్న క్రమంలో బేగంపేట పరిసర ప్రాంతాల్లో వీరిని పట్టుకున్నట్టు తెలిపారు.

Sidhu Maroju
13 Views · 1 month ago

కంటోన్మెంట్ బాపూజీ నగర్ శ్రీ దేవి నల్ల పోచమ్మ చిన్న తోకట్టలోని కట్ట మైసమ్మ ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జంపనను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజు... ఆలయంలో అన్నదానం చేయడం ఆనవాయితిగా వస్తుందని, అమ్మవారిని మనసారా కోరుకుంటే మొక్కులు తీర్చే తల్లి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ భాటియా, ఆలయ కమిటీ సభ్యులు అజిత్, ప్రేమ్ ముదిరాజ్, దుర్గయ్య, రామారావు, నరసింహ, నరేందర్, శ్రీకాంత్, క్రాంతి, విట్టల్.. పాల్గొన్నారు.

Sidhu Maroju
23 Views · 26 days ago

అల్వాల్ పిఎస్ ఏళ్లని కనాజిగూడ అంబేద్కర్ నగర్, ఇంద్రనగర్ స్టాచ్ వద్ద సుమారు 20 ఏళ్లుగా ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బేబీ.. అలియాస్, పాప, సెల్వమ్మ పేరుతో సుమారు 85 మంది వృద్ధురాలు ఈరోజు హఠాత్తుగా మరణించింది. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు, అనాధ శవంగా గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం 108లో పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
@

Sidhu Maroju
19 Views · 27 days ago

రాక్షస రజాకార్ల పైశాచిక కరాల నృత్యాలకు చరమగీతం పాడిన రోజు. రాక్షస పాలన నుండి తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యం పొందిన రోజు. సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పంతో ..
ఎన్ రాయ్ గారి నిరాకరణ భారత మిలటరీ ధైర్య సాహసాలతో.. ఎందరో తెలంగాణ ప్రజల పోరాట ఫలంగా.. మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా.. నిజాం నిరంకుశ కబంధ హస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ 17. ఈ సందర్భంగా అల్వాల్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ తో కలిసి జెండా వందనం గావించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు.పాల్గొన్నారు.
@

Sidhu Maroju
69 Views · 29 days ago

అల్వాల్ లోని పంచశీల ఎంక్లేవ్ లో హోటల్ గోదావరి, లాడ్జ్ అండ్ బంకెట్ హాల్ ను. ముఖ్య అతిథి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథి మచ్చ బొల్లారం 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ హాజరయ్యారు. యాజమాన్యాన్ని మైనంపల్లి... శాలువాలతో సత్కరించారు. హోటల్ యాజమాన్యం.. కె. హనుమంతరావు, సంతోష్, నరేందర్, కరణ్ లు, మాట్లాడుతూ అత్యుత్తమ సౌకర్యాలతో గల తమ గోదావరి హోటల్.. బంకేట్ హాల్, .. లాడ్జ్ లు గల సముదాయాన్ని అల్వాల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.

Show more