కేటీఆర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు విసిరిన సవాల్ కి ఈ రోజు 10గంటలకు నాయిమ్ నగర్ బ్రిడ్జి మీద ఆధారాలతో మీడియా ముఖంగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని...
కేటీఆర్ పూలభిషేకం పై చేసిన వ్యాఖ్యకు, విచక్షణ కోల్పోయిన మాటలకు దీటుగా సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే నాయిని..
అభివృద్ధి అనగానే బి ఆర్ ఎస్ పార్టీ వాళ్లకు లాగులు తడుస్తున్నాయి..
చదువుకొన్న సంస్కార హీనుడు కేటీఆర్..
వాడు వీడు అనే పదజాలం వాడుతున్న కేటీఆర్ ఇదేనా నీ సంస్కారం..
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాయిమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే,మీరు కట్టారు అనడం నీ రాజకీయ వివేకానికి వదిలేస్తున్న...
మీ మాదిరి మాటలు చెప్పే తత్వం నాది కాదు...
ఆధారాలతో సహా బయటపెట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు...
3రోజుల క్రితం విసిన సవాల్ ప్రకారం నేను ఆదివారం 10గంటలకు వచ్చిన..
నాయిమ్ నగర్ పరిసర ప్రాంతల ప్రజలను, వ్యాపార వాణిజ్య శ్రేణులను అడగండి...
నాయిమ్ నగర్ బ్రిడ్జి బీఆర్ఎస్ వాళ్ళు నిర్మించారని ఒక్కరు చెప్పిన రాజీనామ చేస్తా...
దొంగ యుట్యూబ్ ఛానెల్ తో పబ్బం గడిపే మీరు మామ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదు.
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ పక్కద్రోవ పట్టించేందుకు దొంగ యుట్యూబ్ ఛానెల్ లతో పబ్బం గడుపుతున్న కేటీఆర్ అండ్ బి ఆర్ ఎస్ టీం...
రోజుకు ఒక్కసారి దొంగమాదిరి మీడియా లో మాట్లాడటం మళ్ళీ ఫామ్ హౌసులకు పోవడం...
నాయిమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణ మొదటి దశ నుంచి బీజేపీ పార్టీ కార్పొరేటర్, స్థానిక ప్రజలు ఉన్నారు.
ప్రతి రోజు నేను, మేయర్, కలెక్టర్,కమిషనర్ ఇతర అధికారులంతా పర్యవేక్షించం.
ప్రజలు పక్కనబెట్టిన మీ బుద్ధి ఇంకా మారలేదు,మీ అహంకారం ఇంకా పోలేదు...
పొద్దున లేస్తే అభివృద్ధి జీర్ణించుకోలేక ప్రబుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
అభివృద్ధి చేయాలేని దద్దమ్మలు హరీష్ రావు, కేటీఆర్...
మీ మొహాలకు ఏనాడైనా స్వతంత్రంగా పోయి ముఖ్యమంత్రి గారిని నిధులు అడిగిన దాఖలాలు ఉన్నాయా...
మీ మాటలు కోటలు దాటుతాయి చేతలు వాకిలి కూడా దాటలేవు..
నేను పూలభిషేకం కోరుకోలే...
ప్రజలు తమ అభిమాని ఆ రూపంలో చూపించడం పట్ల మీకు కడుపు మంట..
మీ మాదిరి ఏ రోజు కూడా కాళ్ళు మొక్కిచ్చుకునే తత్వం మాది కాదు కేటీఆర్...
బిడ్డ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో...
నేను మాటలలో డబల్ పిజి చేసిన,నేను నోరు తెరిస్తే నువ్వు నీ సువర్టుపురం బ్యాచ్ ఉండదు...
నిజంగా నీ పనులకు కిల్ బిల్ పాండే బిరుదు సరిగా ఉంటుంది కేటీఆర్.
ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని నువ్వైనా ,నీ చెంచలైన నాయిమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం ఎవరు చేపట్టారో ప్రజలు తెలుపాలి.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మంత్రులు,ఎమ్మెల్యేలం అభివృద్ధి దిశగా వెళ్తుంటే మీరు ఒంట పట్టడం లేదు.
మీ ఫామ్ హౌస్లు పోతున్నాయనే భయంతో HYDRA పై విమర్శలు చేస్తున్నారు.
మీ పదేళ్ల పాపానికి ప్రాయశ్చిత్తంగా మేము హైడ్రా తో పవిత్రం చేస్తున్నాం..
మద్రాస్ బాబు నువ్వు నీ మాటలు ఇంకా ప్రజలు వినే స్థితిలో లేరు..
95% శాతం పనులను మేము చేశాం అని చెప్తుంటే ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
సింగిల్ చెక్ ద్వారా 45కోట్ల పై చిలుకు నిధులను కేటాయించి ఈ రోజు కాళోజీ కళాక్షేత్రం నిర్మించిన ఘనత మాది..