మాటల ప్రభుత్వం కాదు - చేతల ప్రభుత్వం ఇది.
అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం.
నాడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డు లు నేడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతిమాట, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే తిరుతామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు. అన్నారు
*శనివారం రోజున రోజున పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ 10 వ డివిజన్ జయా నర్సింగ్ కాలేజి & వడ్డెర కాలనీలో రూ. 15 లక్షలతో అంతర్గత రోడ్లు మరీను బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.*
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లలో ప్రతి వార్డులలో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణం పనులు చెప్పాడుతామని ఎమ్మెల్యే గారు చెప్పుకొచ్చారు. మంజూరు చేసిన పనులను నిర్ణత సమయంలో పూర్తి నాణ్యత ప్రమాణాలు అమలుచేస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంతన్న నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడేడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు.15
తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిచమని మళ్ళీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులను,డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారికీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుందాన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. డిజిటల్ రేషన్, హెల్త్ కార్డుల ప్రక్రియకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంచుకునే విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు ఎస్. కుమార్ యాదవ్, నాయకులు మంద రాకేశ్, రామకృష్ణ, కౌటిల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.