#secunderabad Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!
“ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. తలసానికి ఆహ్వాన పత్రం అందజేత. “|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు, మాజీ మంత్రి మరియు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను వివరించిన లేఖను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు.
జులై 19న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 2న అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారని తెలిపారు.
ఆగస్టు 3న సంప్రదాయబద్ధంగా రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు.
ఈ సమావేశంలో రాంగోపాల్‌పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రామ్ మోహన్ యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
#Sidhumaroju
The post “ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. తలసానికి ఆహ్వాన పత్రం అందజేత. “| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 14న ప్రత్యేక బృందం క్లూస్ టీమ్, స్వతంత్ర సాక్షులతో కలిసి దేవకి లాడ్జ్‌లో సోదాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా బీహార్‌కు చెందిన రిషి కుమార్ (23)తో పాటు 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని వారి సామాను తనిఖీ చేయగా, 13 ప్యాకెట్లలో ఉన్న 17 కిలోల గంజాయి లభ్యమైంది.
విచారణలో నిందితులు ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని పూణేకు హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో ప్రధాన సరఫరాదారుగా భావిస్తున్న బీహార్‌కు చెందిన విజయ్ అలియాస్ సంభవ్ కుమార్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
గంజాయితో పాటు నిందితులు ఉపయోగిస్తున్న రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.
మల్కాజిగిరి జోన్ డీసీపీ C. శ్రీధర్ , ఏసీపీ యాదగిరి రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న గోపాలపురం పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
#Sidhumaroju
The post “సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“గోవాలో దొరికిన ఢిల్లీ దొంగ.. రూ.82 లక్షల సొత్తు రికవరీ చేసిన మార్కెట్ పోలీసులు”|
సికింద్రాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పోలీసుల చాకచక్యంతో భారీ ఇంటి చోరీ కేసు ఛేదించబడింది. ఇంటి తాళాలు పగులగొట్టి లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించిన అంతర్రాష్ట్ర దొంగను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు, చోరీకి గురైన మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, పోట్ మార్కెట్ ప్రాంతానికి చెందిన సందీప్ రఘునాథ్ చవాన్ అనే వ్యక్తి ఈ నెల 27న రాత్రి ఇంట్లో చోరీ జరిగినట్లు మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను ఉద్యోగ నిమిత్తం బయట ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి చెక్క పెట్టెలో భద్రపరిచిన బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నాడు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నిందితుడు గోవాలో తలదాచుకున్నట్లు గుర్తించారు. అనంతరం ప్రత్యేక బృందం ఉత్తర గోవాలోని కలంగుట్ ప్రాంతానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుంది.
అరెస్టైన వ్యక్తిని ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మనోజ్ సింగ్‌గా గుర్తించారు. విచారణలో అతడు అలవాటైన అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. ఢిల్లీలో అతనిపై 19 చోరీ కేసులు నమోదై ఉండటంతో పాటు పలు నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో తిహార్ జైలులో కూడా శిక్ష అనుభవించినట్లు గుర్తించారు.
ఈ కేసులో చోరీకి గురైన సుమారు 576 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి సహా మొత్తం రూ.82 లక్షల విలువైన ఆస్తిని నిందితుడి వద్ద నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
ఏసీపీ వి. యాదగిరి రెడ్డి నాయకత్వంలో, మార్కెట్ ఇన్‌స్పెక్టర్ వి. రామ్‌చందర్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎం. బషీర్ అహ్మద్, ఎస్సైలు. నరేష్, ఎ. నరేష్, రవి, తదితర సిబ్బంది ఈ కేసును ఛేదించారు.
మల్కాజిగిరి జోన్ డీసీపీ. శ్రీధర్, ఐపీఎస్ పర్యవేక్షణలో, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి, ఐపీఎస్. మార్గదర్శకత్వంలో చేపట్టిన దర్యాప్తు ఫలితంగా నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేయగలిగారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల సహకారంతోనే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.
#Sidhumaroju
The post “గోవాలో దొరికిన ఢిల్లీ దొంగ.. రూ.82 లక్షల సొత్తు రికవరీ చేసిన మార్కెట్ పోలీసులు”| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తలెత్తిన విభేదాలు, పెరిగిన కక్షలు చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలిగొన్నట్లు దర్యాప్తులో తేలింది.
మారేడుపల్లి ప్రాంతానికి చెందిన శ్రవణ్ (22) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవడంతో స్థానికంగా కలకలం రేగింది.
కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ విచారణను వేగవంతం చేశారు.
దర్యాప్తులో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివాదాలే హత్యకు కారణమని బయటపడింది.
ఈ కేసులో నిఖిల్ (19), సందీప్ (19), రమేష్ (20), నాగరాజు (26)లను నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఘటన వెనుక ఉన్న పూర్తి అసలు వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ముందస్తు ప్రణాళికతోనే శ్రవణ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు విచారణలో తేలింది.
హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుల జాడను గుర్తించిన పోలీసులు ఎక్కడా సమయం వృథా చేయకుండా వరుస ఆధారాలను సేకరించారు.
సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారాన్ని సమన్వయం చేస్తూ నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
నేరం జరిగిన 24 గంటలు పూర్తికాకముందే కేసును ఛేదించి నిందితులను మీడియా ముందుకు తీసుకురావడం పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పింది.
ఈ కేసు ఛేదనలో బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తి పర్యవేక్షణలో, మారేడుపల్లి ఎస్‌హెచ్‌ఓ నోముల వెంకటేష్ నేతృత్వంలోని పోలీసు బృందం కీలక పాత్ర పోషించింది.
కేసుకు సంబంధించిన ప్రతి కోణాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఆధారాలతో సహా నిందితులను చట్టం ముందు నిలబెట్టింది.
#,Sidhumaroju
The post ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“Helmet On, Worries Gone” సందేశంతో సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ శిల్పావిష్కరణ.|
సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
“Helmet On, Worries Gone” అనే సందేశంతో రూపొందించిన భారీ హెల్మెట్ శిల్పాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించింది.
మెడికవర్ హాస్పిటల్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ మరియు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆవిష్కరించారు.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, హెల్మెట్ ధరించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ.. ప్రమాద బాధితుల్లో అధిక శాతం మంది తలకు తీవ్రమైన గాయాలతోనే అత్యవసర విభాగానికి చేరుతున్నారని తెలిపారు.
హెల్మెట్ వినియోగం వల్ల ప్రాణాపాయం తగ్గడమే కాకుండా మెదడు దెబ్బతినడం వల్ల కలిగే శాశ్వత వికలాంగత్వం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కోమా వంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని వివరించారు.
నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ భారీ హెల్మెట్ శిల్పం ప్రతిరోజూ వేలాది మందికి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ అవగాహన చిహ్నంగా నిలవనుంది. “ప్రయాణం ఎంత చిన్నదైనా హెల్మెట్ మాత్రం తప్పనిసరి” అనే సందేశాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
“AWARE & ALIVE” భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డా. రమేష్ శిఘాకోలి, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డా. బాలసుబ్రహ్మణ్యం, సెంటర్ హెడ్ కృష్ణవేణి, వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ మరియు పోలీసు శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
#Sidhumaroju
The post “Helmet On, Worries Gone” సందేశంతో సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ శిల్పావిష్కరణ.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“జూన్ 2న హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ వేడుకలతో పలు మార్గాల్లో ఆంక్షలు!”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో పలు మార్గాల్లో తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
బేగంపేట్, సంగీత్, క్లాక్ టవర్, పట్నీ, పారడైజ్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అవసరాన్ని బట్టి పలు కూడళ్ల వద్ద వాహనాలను మళ్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు వీలైనంత వరకు మెట్రో రైలు మరియు ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని, కార్యక్రమం జరిగే ప్రాంతాలకు వెళ్లే రహదారులపై భారీ వాహనాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
రహదారులపై అనధికారిక పార్కింగ్‌ను కఠినంగా నిషేధించినట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను టోయింగ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అత్యవసర సేవల వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమం ముగిసిన వెంటనే ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేయబడతాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ పరిస్థితులను సీసీటీవీ కెమెరాలు మరియు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని, ట్రాఫిక్ సంబంధిత సమాచారం లేదా సహాయం కోసం మల్కాజిగిరి ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 8712662999ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju
The post “జూన్ 2న హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ వేడుకలతో పలు మార్గాల్లో ఆంక్షలు!” appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“జింఖానా గ్రౌండ్స్‌లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.|
సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.
యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో శాంతి, సామరస్యం నెలకొనాలంటే యువత దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి మానవ సంబంధాలు మరింత పరిపుష్టి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో పెద్ద కుటుంబాల్లో పెరిగిన పిల్లలు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారని, కానీ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
అలాంటి తల్లిదండ్రుల ఆందోళనలను దూరం చేసి యువతలో సానుకూల మార్పు తీసుకురావడానికి “The Confluence – Rhythm of Bhakti” వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో G. కిషన్ రెడ్డి , N. రాంచందర్ రావు, తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు.
యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ నేర్చుకునే విలువలను జీవితంలో ఆచరించాలని ఈటల రాజేందర్ కోరారు.
#Sidhumaroju
The post “జింఖానా గ్రౌండ్స్‌లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
జియాగూడకు చెందిన పల్లవి గౌడ్(19) ఛాతిలో పెరిగిన గడ్డకు ఈ నెల 19న గాంధీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు సమాచారం.
పల్లవి బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్నట్లు తెలిసింది.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న వైద్యులు.. నివేదిక వచ్చిన తరువాతే అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#Sidhumaroju
The post “డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“30 వేల లంచం.. ఏసీబీకి దొరికిపోయిన లేడీ ఎస్సై!”
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) కిరణ్ నందిత, స్టేషన్ రైటర్ (కానిస్టేబుల్) బి. విజయ్ కుమార్ రూ. 30,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ప్రేమ వివాహం చేసుకున్న పాత బోయిన్‌పల్లికి చెందిన అభిషేక్ అనే యువకుడిపై అతని తండ్రి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన అభిషేక్, కోర్టు నిబంధనల ప్రకారం ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది.
అయితే, ఈ బెయిల్ షరతులను సడలించేందుకు, కేసు ముగిసే వరకు పోలీసుల సహకారం అందించేందుకు ఎస్సై నందిత, రైటర్ విజయ్ కలిసి లంచం డిమాండ్ చేశారు.
ఇందుకోసం కానిస్టేబుల్ విజయ్ కుమార్ గతంలోనే బాధితుడి నుండి రూ. 10,000 వసూలు చేయగా, మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని ఎస్సై నందిత తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
స్టేషన్‌లో ఉన్నతాధికారులతో పాటు అందరికీ వాటాలు ఇవ్వాలంటూ, డబ్బులు ఇస్తేనే కేసు మేనేజ్ చేస్తానని నందిత స్పష్టం చేయడంతో విసిగిపోయిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఏసీబీ డీఎస్పీ చలసాని శ్రీధర్ పర్యవేక్షణలో సిటీ రేంజ్-2 అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు.
ఎస్సై నందిత ఆదేశాల మేరకు బాధితుడు అభిషేక్ లంచం డబ్బును పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఆమె హోండా యాక్టివా స్కూటర్ డిక్కీలో ఉంచాడు.
ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి, స్కూటర్ డిక్కీ నుండి రూ. 30,000 రసాయనాలతో కూడిన నోట్లను స్వాధీనం చేసుకుని ఎస్సై నందితను, కానిస్టేబుల్ విజయ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (CI)తో పాటు మరికొంత మంది సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా విచారించగా, వారి ప్రమేయం ఏమీ లేదని స్పష్టమైంది.
అనంతరం మహిళా ఎస్సై నందిత వ్యక్తిగత క్యాబిన్‌తో పాటు ఆమెకు సంబంధించిన సేవా పత్రాలు, డైరీలు, ఇతర కీలక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ అవినీతికి పాల్పడిన ఇద్దరు పోలీసు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా 1064 అనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఏసీబీని సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju
The post “30 వేల లంచం.. ఏసీబీకి దొరికిపోయిన లేడీ ఎస్సై!” appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“ప్రేమ వివాదం.. బీటెక్ విద్యార్థి హత్య కేసు, ఛేదించిన పోలీసులు.|
హైదరాబాద్ : నగరంలోని చిలకలగూడలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ హత్య కేసును చిలకలగూడ పోలీసులు ఛేదించారు.
ప్రేమ వ్యవహారంపై ఏర్పడిన విభేదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మే 7 రాత్రి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో అఖిల్‌పై కత్తులతో దాడి జరిగింది. మెడతో పాటు శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
బాధితుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణతో విచారణను వేగవంతం చేసిన పోలీసులు, హత్య వెనుక ప్రేమ వ్యవహారం కారణమని గుర్తించారు.
యువతితో అఖిల్ సన్నిహితంగా ఉండడాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు విచారణలో తేలింది.
ఘటనకు నాలుగు నుంచి ఐదు రోజుల ముందే నిందితులు మెడిబావిలో సమావేశమై అఖిల్‌ను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి కదలికలపై నిఘా ఉంచి, సరైన సమయం చూసి దాడికి దిగినట్లు తెలిపారు.
ఈ కేసులో అల్లబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి, రాజం పరమేశ్ కుమార్ యాదవ్, రాజం వంశీ కృష్ణ అలియాస్ రాఖీ, రాజం మనీష్ అలియాస్ బిచ్చు సహా మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు జువెనైల్‌గా ఉన్నట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు సాయి కిరణ్‌పై ఇప్పటికే చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఘటన అనంతరం నగరంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
డీసీపీ రక్షిత కృష్ణమూర్తి విడుదల చేసిన ప్రకటనలో, ప్రతీకార దాడులు, ఆస్తుల ధ్వంసం, నిందితుల కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి చర్యలను కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, విద్వేషపూరిత ప్రచారం, తప్పుడు రెచ్చగొట్టే పోస్టులు, విద్వేషపూరిత ప్రచారం, తప్పుడు సమాచారంపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎవరినైనా ఉపేక్షించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
#Sidhumaroju
The post “ప్రేమ వివాదం.. బీటెక్ విద్యార్థి హత్య కేసు, ఛేదించిన పోలీసులు.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.