Devotional
Sub Category
నగర నలుమూలల నుంచి దేవాలయానికి వస్తున్న భక్తులు స్వామివారికి తమ వంతు విరాళాలు అందజేయడం సంతోషకరమని కంటోన్ మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్అన్నారు. న్యూ బోయిన్ పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు జంపన ప్రతాప్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం న్యూ బోయిన్ పల్లి కి చెందిన యుగంధర్ రెడ్డి, శైలజ, శృతి, అజిత్, ప్రవీణ్ కుమార్, మరియు సంధ్యారాణి స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన కంటె ఆభరణాన్ని జంపనకు అందజేశారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు సమర్పించిన కంటే ఆభరణాన్ని స్వామివారికి అలంకరింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, యాదయ్య, జగన్నాథం, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అల్వాల్ సర్కిల్ ఖానాజీగూడ లో కృష్ణ ఎంక్లేవ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అమ్మవారికి ఈటల రాజేందర్ శాస్త్రోచ్చకంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈటెలను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... అమ్మవారి దర్శనం తనకు చాలా ఆనందం కలిగించిందన్నారు. ఇలా ప్రతి ఏట నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ప్రజలందరిపై అమ్మవారి దయ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎంపీ సింగ్, మురళీకృష్ణ, సుజిత.. తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో మూలా నక్షత్ర పర్వదినం చoడిహోమం
దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా న్యూ బోయిన్ పల్లి బాపూజీ నగర్ శ్రీ దేవి నల్ల పోచమ్మ ఆలయంలో గురువారం మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. నవరాత్రులు చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో విశేషాలంకరణలో ఉన్న అమ్మవార్లను కొలిస్తే కోరిన కోరికలతో పాటు, అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయని అన్నారు. నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయం వద్ద ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవరాత్రులలో ఒక్కో రోజు విశేశాంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని జంపన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, అజిత్, జహంగీర్, మారుతి గౌడ్, నర్సింహా, నరేందర్, శ్రీకాంత్, మోను, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
బోయిన్ పల్లి లోని న్యూ సిటీ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంని గరుడ అల్వార్ విగ్రహానికి కవచాన్ని బహుకరించిన శ్రీనివాస్ వీరమణి ప్రీతి రెడ్డి.ఇందులో భాగంగా శనివారం.. ఆలయ ట్రస్ట్ అడ్వైజర్ జంపన ప్రతాప్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కవచ దాతలకు ఆలయ అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని శానువాలతో సత్కరించారు. ఆలయానికి దాతలు సహాయ సహకారాలు అందించాలనుకుంటే, ఆలయ కమిటీని సంప్రదించాలని జంపన కోరారు. ఈ కార్యక్రమంలో.. ఆలయ కమిటీ సభ్యులు నారాయణ, జగన్నాథం, యాదయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
న్యూ బోయిన్ పల్లిలోని బాలుర పాఠశాల సమీపంలో గల విద్య గణపతి ఆలయ ఆవరణలో రానా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ నేతృత్వంలో నవరాత్రులలో పూజలు అందుకున్న గణనాథుడు మండపం నుండి భక్తుల జేజేల నడుమ అంబేద్కర్ చౌరస్తా, చిన్న తోకట్ట, యేడుగుల్లు, పెద్ద తోకట్ట, బాపూజీ నగర్ ద్వారా ... బోలో గణపతి మహారాజ్ కి జై, గణపతి పప్పా మోరియా.. భక్తి నినాదాల మధ్య అడుగడుగునా భక్తుల నిరాజనాలు అందుకుంటూ , యువతి యువకుల ఆనందోత్సాహాల మధ్య, మహిళా నేతలు డాన్స్ లు చేస్తూ శామీర్ పేట చెరువుకు తరలించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ..గణనాథుడి ఆశీస్సులతో నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పూజించామని తెలియజేశారు. అండ్ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులకు, విద్యుత్ సిబ్బందికి, కంటోన్మెంట్ బోర్డ్ శానిటేషన్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ కాంగ్రెస్నాయకులు, దండుగుల యాదగిరి,బిజెపి నేతలు భానుక మల్లికార్జున్, బి ఎన్ శ్రీనివాస్ తో పాటు జిపి యువసేన ప్రతినిధులు, రాము గౌడ్, గోపి, రవీందర్, జంపన రవి, పవన్, రాజేష్, సిరాజ్, చోటు, మౌలా, వరప్రసాద్ మధు శశి తదితరులు పాల్గొన్నారు.
బోయిన్ పల్లిలోని సౌజన్య కాలనీ, మర్రి రామ్ రెడ్డి కాలనీ, , నూతన్ కాలనీ, అహల్య, బాలాజీ అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణనాథునికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్. వినాయక కమిటీ అసోసియేషన్ సభ్యులు జంపనను సత్కరించి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన వితరణలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో.. వి. ఆర్. ఎమ్. డి., నందకిషోర్. మాల్యాద్రి. నరేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, సంపత్ రెడ్డి, మాధవి, నాగేశ్వర్ రావు, చంద్రశేఖర్ నిర్వహించారు.
అన్నదాన వివరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కంటోన్మెంట్ ఒకటో వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మండపాల్లో జరిగిన పూజల్లో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఓల్డ్ ఎయిర్పోట్ రోడ్డు లోని టీటీడీ సాంస్కృతిక కళాశాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపం తో పాటు వాయు నగర్, కంసాలి బజార్, మలాని కాలనీ, బాపూజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆది దేవుడైన గణేశుడికి పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మోహన్, పవన్, వర.. తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఆగాలని భక్తులు మరో రెండు ప్రదక్షిణలు చేయబోతున్నారు చిలుకూరి బాలాజీ అర్చకులు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనికోసం వరుణుడు శాంతించి వర్షాలు ఆగాలని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వరుణుడు శాంతించాలని రెండు ప్రదక్షిణలు ఎక్కువ చేయాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. అలాగే వరద సహాయానికి అన్ని విధాల సహకరించిన వారిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ పూజారి సి ఎస్ రంగరాజన్ మాట్లాడుతూ.... రెండు తెలుగు రాష్ట్రాలు వరుణ దేవుని ఉగ్ర తీవ్రతను ఎదుర్కొంటున్నాయని, ఇటువంటి విపత్కర పరిస్థితులలో చిలుకూరి బాలాజీ మళ్లీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనల్ని మరింత విధ్వంసం నుండి రక్షించాలని ప్రార్థించడం జరిగింది. తుఫాన్, లాంటి మరిన్ని ప్రమాదాల నుండి మరిన్ని వర్షాలు పడకుండా జల ప్రళయం జరగకుండా సుదర్శన అష్టకష్టాలు పడకుండా గోవింద నామ స్మరణతో శక్తివంతమైన ప్రదక్షిణలు చిలుకూరులో నిర్వహించామని, సకల జీవుల భద్రత కోసం ప్రార్థనలు చేశామని చెప్పారు. వరదలు, విధ్వంసం, గాయం, విపత్తు, మరియు ఆకస్మిక మరణాల నుండి రక్షణ కోసం ... ప్రతికూల వాతావరణం కారణంగా సంక్షోభ సమయంలో గోవింద నామ స్మరణతో ప్రదక్షిణలు నిర్వహించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి సత్వర భక్తుల సహాయం కోసం విరాళాలు అందించాలని నిర్ణయించారు.
కంటోన్మెంట్ బాపూజీ నగర్ శ్రీ దేవి నల్ల పోచమ్మ చిన్న తోకట్టలోని కట్ట మైసమ్మ ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జంపనను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజు... ఆలయంలో అన్నదానం చేయడం ఆనవాయితిగా వస్తుందని, అమ్మవారిని మనసారా కోరుకుంటే మొక్కులు తీర్చే తల్లి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ భాటియా, ఆలయ కమిటీ సభ్యులు అజిత్, ప్రేమ్ ముదిరాజ్, దుర్గయ్య, రామారావు, నరసింహ, నరేందర్, శ్రీకాంత్, క్రాంతి, విట్టల్.. పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ఒకటవ వార్డులో ని శ్రీ ముత్యాలమ్మ దేవాలయ గడప ముఖద్వార పూజ కార్యక్రమాలు బుధవారం ఆలయంలో ఘనంగా జరిగాయి. ఈ ఆలయ చైర్మన్ జంపన ప్రతాప్ తో పాటు ఆలయ ప్రతినిధులు హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన గడపకు ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాలమ్మ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు అని, ఎంతోమంది భక్తుల కోరికలు తీర్చిన అమ్మవారిగా నేటికీ పూజలు అందుకుంటున్నారని జంపన ప్రతాప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు,దుర్గయ్య,రామారావు,శ్రీకాంత్,అజిత్,కొమురయ్య,లక్ష్మణ్, ప్రేమ్ ముదిరాజ్,మల్లేష్, నర్సింగ్ రావు.. పాల్గొన్నారు
శ్రీ కృష్ణ జన్మష్టమి ఎమ్మిగనూరు లో సరస్వతి స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు
షిరిడి గురు పౌర్ణమి
I flew to India to study Hinduism, and that's where I had an inspiring chat with...Sri Sri Shankar. I hope you are inspired by this conversation.
#gurudev #bharataawaz #devotional #history&Culture #newvideo #trendingvideo
Famous Temples of Tamilnadu | tamilnadu temples tour | best temples of tamilnadu
#bharataawaz #besttemplesoftamilnadu
#temples #tamilnadu #god #bestoftamilnadu
Here top 10 best temples names to visit in india
#bharataawaz #besttemples #temples
#top10temples #besttemplestovisit
In these video daniel talks about how to read the bible for beginners
and given 7 important tips
#bharataawaz #bible #jesus #christains
#bibletipls
Kedarnath, India's most popular and Remotest Pilgrimage Place. Where people from all over the world come on one of the hardest journeys, Just for a glimpse of the Kedarnath temple.
#kedarnath2023
#kedarnath
#kedarnathdham
#kedarnathyatra2023 #devotional #bharataawaz #newvideo #Trendingvideo
journeying through the 10-kilometer-long corridors of Tamil Nadu's Ranganatha swamy temple, amongst towering Gopurams and spectacular sculptures, you'd find over 600 ancient inscriptions carved on its walls. Take a deep dive into the rich cultural heritage of this vast temple that has been a center of worship for centuries.
#ranganathaswamytemple #tamilnadu #ancientinscriptions #culturalheritage #templearchitecture #indianhistory #sacredjourney #gopurams #sculptures #historicalsite #bharataawaz #devotional #Viralvideo
two muslim friends in jammu kashmir donated their 1crore worth land to construct a road for a 500 years old temple.
#temple #india #jammkashmir #muslimfriends #oldtemple #kashmir #suraksha #bharataawaz #surakshabharataawaz