Latest videos
సికింద్రాబాద్... మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరి గూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని నిన్న రాత్రి ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగంతకులు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు. ఆలయం వద్దఉద్రిక్త పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
అంగరంగ వైభవంగా వూరేగింపుగా వివిధ రకాల వేశాధారణాలతో, రంగు రంగు ల పూల అలంకరణతో అమ్మవారిని నామజ్జనానికి భక్తులు, ప్రజలు సాగణంపుతువుంటె అ తల్లి చల్లని చూపులతో పిల్ల జెల్ల చిన్న పెద్ద అందరికి దీవెనలు ఇస్తూ మళ్ళీ సంవత్సరo వరకు అష్ట ఐశ్వర్యల తో ఉండాలని వెళ్లిపోయారు. మల్కాజ్గిరి గాంధీ పార్క్ సభ్యులు ఆనందం సాగానంపారు.
బన్ని ఉత్సవం ఇది ఒక సంబరం
*_నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.._*
జైపూర్ లోని అజ్మీర్ రోడ్డులో ఘటన
కారు ఏసీ నుంచి పొగలు, మంటలు
హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
మంటలతోనే రోడ్డుపై పరుగులుపెట్టిన కారు
భయాందోళనతో పరుగులు పెట్టిన స్థానికులు
చివరకు డివైడర్ ను ఢీ కొట్టి నిలిచిన కారు
కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ జితేందర్
శక్తి పటాల వద్ద ఘర్షణ
రుస్తుం బాధ , బలరాంపేట మధ్య ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ దాడి
పోలీసులు అదుపు చేస్తున్న........ అదుపుగాని ఘర్షణ పోలీసులు లాఠీ ఛార్జ్
దసరా నవత్రులు మల్కాజ్గిరి patelnagar వాసులు భక్తి శ్రద్దలతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం విజయవాడ కృష్ణ నది లో చేయడానికి శోభయాత్ర ప్రారంభించారు.
నగర నలుమూలల నుంచి దేవాలయానికి వస్తున్న భక్తులు స్వామివారికి తమ వంతు విరాళాలు అందజేయడం సంతోషకరమని కంటోన్ మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్అన్నారు. న్యూ బోయిన్ పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు జంపన ప్రతాప్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం న్యూ బోయిన్ పల్లి కి చెందిన యుగంధర్ రెడ్డి, శైలజ, శృతి, అజిత్, ప్రవీణ్ కుమార్, మరియు సంధ్యారాణి స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన కంటె ఆభరణాన్ని జంపనకు అందజేశారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు సమర్పించిన కంటే ఆభరణాన్ని స్వామివారికి అలంకరింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, యాదయ్య, జగన్నాథం, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల్ జిల్లాలోని మందమరి పట్టణంలో ఘనంగా దసరా వేడుకలు .
మంచిర్యాలలోని పవిత్రమైన గోదావరి నది ఒడ్డున శ్రీ గౌతమేశ్వర ఆలయం వద్ద దసరా వేడుకలు ఘనంగా జరుపు కున్నారు ఈ సందర్భంగా జమ్మి చెట్టు పూజా చేసి.. ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు
నవరాత్రి పర్వ దినాలు చివరకు దశకు చేరాయి. ఎక్కడ చూసిన దసరా కోలాఫలమే. భారతావనిలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. దసరా లేదా... విజయదశమి, చెడు పైన మంచి సాధించిన విజయానికి సంకేతంగా శ్రీరాముడి చేతిలో రావణుడి సంహారం దసరా దశమి నాడే జరిగిందని హిందువులు నమ్ముతారు. విజయానికి సంకేతంగా హిందువులు జరుపుకునే అతి గొప్ప పండగ దసరా. ఈ సందర్భంగా అల్వాల్ లోని పలు కాలనీలలో దసరా వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
Bharat Aawaz - Desh Ki Aawaz | India's Latest NEWS, Updates and Inside Stories. Bharat Broadcast And Media Association
Piper
VADLA AGONDA
VADLA AGONDA
VADLA AGONDA
VADLA AGONDA
VADLA AGONDA |
0 Subscribers
Manage
Videos
PlayLists
Liked videos
About
Latest videos
VID_20241011_182614
1:46
VID_20241011_182614
VADLA AGONDA
0 Views · 19 hours ago
చిన్న వర్షానికి రోడ్ మొత్తం నీట మునిగి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది వాహన చోదకులు మరియు కాలినడకన వెళ్లే వ్యక్తులు జారీ పడిపోవడం జరిగింది అని అక్కడి కాలనీ వాసులు వారి యొక్క భాదను భారత్ అవాజ్ డిజిటల్ మీడియా వెళ్ళావించారు. అయితే మౌలాలి, చందన బా గ్ రోడ్, క్లాసిక్ ఫంక్షన్ హాల్ ముందు ఇ వాననీరు ఆగడం జరిగింది. ఇ విషయాన్నీ GHMC మునిసిపల్ అధికారులు సీరియస్గా తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.
వి ఏ చారీ
*గన్నవరం నియోజక వర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు*
*గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండగ మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. విజయదశమి సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహిషాసురుని వధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ అందరికీ ఆనందాన్ని అందించాలని కోరారు. అమ్మలు గన్న అమ్మ, మూలపుటమ్మ, ఆ పెద్దమ్మ దుర్గమ్మతల్లి ఆశీస్సులతో గన్నవరం నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే విజయదశమి వేడుకలను ఆనందోత్సాహాలతో ప్రజలంతా జరుపుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు ..
దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు..
గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యాలు, అరాచకాలతో అవస్థలు పడిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారధ్యంలో సాంత్వన చేకూరిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు..
రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా అడుగులు వేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా కల్పించారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు..
చిన్న వర్షానికి రోడ్ మొత్తం నీట మునిగి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది వాహన చోదకులు మరియు కాలినడకన వెళ్లే వ్యక్తులు జారీ పడిపోవడం జరిగింది అని అక్కడి కాలనీ వాసులు వారి యొక్క భాదను భారత్ అవాజ్ డిజిటల్ మీడియా వెళ్ళావించారు. అయితే మౌలాలి, చందన బా గ్ రోడ్, క్లాసిక్ ఫంక్షన్ హాల్ ముందు ఇ వాననీరు ఆగడం జరిగింది. ఇ విషయాన్నీ GHMC మునిసిపల్ అధికారులు సీరియస్ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
మంచిర్యాలలోని సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు
పి గన్నవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనమును సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి ఆధ్వర్యంలో ప్రారంభించిన పి గన్నవరం శాసనసభ్యులు గౌ శ్రీ గిడ్డి సత్యనారాయణ .ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు మరియు పి గన్నవరం గ్రామ వార్డ్ నెంబర్ లు కూటమి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గున్నారు.
పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులు తోలేటి సత్తిబాబు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు పాల్గొని NDA కూటమి నాయకులతో సమన్వయము చేసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.
కంగ్టి మండల కేంద్రములో ని బొర్గి గ్రామంలో ఇంటింటా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
అల్వాల్ సర్కిల్ ఖానాజీగూడ లో కృష్ణ ఎంక్లేవ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అమ్మవారికి ఈటల రాజేందర్ శాస్త్రోచ్చకంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈటెలను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... అమ్మవారి దర్శనం తనకు చాలా ఆనందం కలిగించిందన్నారు. ఇలా ప్రతి ఏట నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ప్రజలందరిపై అమ్మవారి దయ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎంపీ సింగ్, మురళీకృష్ణ, సుజిత.. తదితరులు పాల్గొన్నారు.
అల్వాల్ జిహెచ్‌ఎంసి నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఉద్యోగులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో మునిగితేలారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వెంకట్, ఈ శ్రీకాంత్. ఏ ఎమ్హెచ్ ఓ రజని. సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో మూలా నక్షత్ర పర్వదినం చoడిహోమం
బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ. చెరువుకు... బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉంది.
బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువులను కాపాడుకుందాం. చెరువులను పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉంది.
హైదరాబాద్ నాంపల్లి లోని టీజీవో భవన్ లో టీజీవో కేంద్ర సంఘం ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో మంత్రి సీతక్క పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.... మనకు పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారం..సంస్కృతి బతుకమ్మ. బతుకును ఇచ్చే బతుకమ్మను భవిష్యత్తు తరాలకు ఈ పండుగను అందించడమే మన బాధ్యత. ఈరోజు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. చెరువులను కబ్జాల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చెరువులకు పూజలు చేసే బతుకమ్మ పండుగ. తెలంగాణ అంటేనే చెరువులు.. బతుకమ్మ పండుగ. గతంలో మన జీవనశైలి చెరువుల పైనే ఆధారపడి ఉండేది. చెరువులలోనే నీరు తాగేది, చెరువుల ద్వారానే పొలాలకు నీరు అందించేది.. హైదరాబాద్ కు లేక్ సిటీ అనే పేరు ఉండేది. కానీ ఈరోజు అవి కనుమరుగయ్యాయి. ఆటలు...పాటలు బతుకమ్మకు పూజలు.. ఈ సంస్కృతి తరతరాలకు అందించే బాధ్యత మన పైన ఉందని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా తునిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగులు ఎలా లాక్కున్నారో చూడండి.
గుంటూరు కలెక్టర్ కార్యాలయం అరుదైన సన్నివేశం*
*వైసిపి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎన్ డి ఏ కూటమి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ ఆలింగనం*
ఎన్టీఆర్ జిల్లా : నందిగామ మండలంలోని అంబారుపేటలో వేంచేసియున్న శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు , ఆయన సతీమణి శిరీష సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారి దేవస్థానంలో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం శాసనసభ్యులు కృష్ణప్రసాదు దంపతులను ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని, వేదపండితుల శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. కన్నులపండువగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
_ఎన్టీఆర్ జిల్లా:_
_అర్థగంటలోనే ముగిసిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.._
_ఇకనుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల అందరితో కలిసి మెలిసి వెళ్తాను._
_గతంలో లాగా ఉండదని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి.._
_25 మందితో కమిటీని వేస్తాను, వారి నిర్ణయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతాను- విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని._
హైద్రబాద్ మెట్రో రైలు ని మేడ్చల్ మరియు షామీర్ పేట వరకు పొడిగించాలని సుచిత్ర వద్ద చేస్తున్న ధర్నా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు అత్యంత అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, షామీర్ పేట వరకు జూబ్లీ బస్టాండ్ నుండి మెట్రో రైలు మార్గాన్ని పొడగించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారం అందేలా చూసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా ఐటి ఉద్యోగులు అత్యధికంగా ఉన్న ప్రాంతంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, ఈ ఇబ్బంది దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి రైలు మార్గాన్ని పొడిగించే దిశగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కార్యదర్శి భరత్ సింహారెడ్డి, రాజు రెడ్డి, సతీష్ రంగంపేట. పత్తి సతీష్, పులి బలరాం, నల్లి జయశంకర్ గౌడ్, శేఖర్ యాదవ్, శ్యామ్ కిరణ్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అల్వాల్ ల్లో బతుకమ్మ సంబరాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా.. రెండో రోజు అటుకుల బతుకమ్మతో మహిళలు ఆడి పాడారు. రెండో రోజు బతుకమ్మను రెండు పూల వరసలతో పేర్చిన మహిళలు, అశ్వయుజ శుద్ధ విదియ అయిన నేడు మూడో రోజు. మూడు పూల బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా మూడు వరుసలతో పేర్చి సంబరాలు అంబరాన్ని అంటేలా అల్వాల్ కొత్తచెరువు వద్ద మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మి కాంత్ రెడ్డి విచ్చేసి సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
నేటి యువత వివిదా వ్యాసనాలకు అలవాటు పాడి ఏమి చేస్తున్నారో వాలక్కి అర్ధం కానీ పరిస్థితి. ఈ దుస్థితిని చూస్తే ప్రజలు బయోప్రాంతానికి గురుతున్నారు. మాన పిల్లలు ఏమి చేస్తున్నారో వల కథలికను చూస్తూ ఉండాలి. ఈ క్రింది వీడియో ని చూడండి
పత్రికా ప్రకటన..
తేదీ:4-10-2024.
దళిత మహిళ గోవిందమ్మ
దీక్షకు మద్దతు తెలిపినఉపాధ్యాయ సంఘాలురోజురోజుకు గోవిందమ్మ దీక్షకు పెరుగుతున్న ప్రజాసంఘాల మద్దతు...దళిత ప్రజా సంఘాల జేఏసీఎమ్మిగనూరు నియోజకవర్గంత నెలలో పెద్ద కడుబూరు మండలం ,కల్లుకుంట గ్రామంలో దళిత సోదరీ అయినా గోవిందమ్మ పై దాడి చేసి అమానుషంగా కొట్టి వివస్త్రను చేసిన నిందితులను అందర్నీ తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాలని . గోవిందమ్మ కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యోగాలులో ఉన్న అధికారులు ఈ ఘటనపై స్పందించి బాధిత కుటుంబాలను పరామర్శించ లేకపోవడం చాలా దురదృష్టకరం.గోవిందమ్మకు న్యాయం ఎక్కడ కూడా జరగలేనందును...దీక్షకు పూనుకున్న గోవిందమ్మ కు మాదిగ టీచర్ సంఘాల నాయకులు, సుధాకర్ , తిమ్మరాజు,సాగర్, రాజశేఖర్, దావీదు,మరియ మాల మహానాడు నాయకులు మధుబాబు , మహిళా సంఘాల నాయకులు ఏలీషామ్మ ఈరమ్మ,మార్తమ్మ,భారతమ్మ,సుశీలమ్మ, స్త్రీ విముక్తి POW రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ, ఆదోని డివిజన్ కన్వీనర్ కళావతి అందరూ కూడా పూర్తిస్థాయి మద్దతు తెలపడం జరిగింది. గోవిందమ్మకు న్యాయం జరిగేంతవరకు దీక్షలు విరమించే ప్రసక్తి లేదు అని అన్నారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా న్యూ బోయిన్ పల్లి బాపూజీ నగర్ శ్రీ దేవి నల్ల పోచమ్మ ఆలయంలో గురువారం మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. నవరాత్రులు చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో విశేషాలంకరణలో ఉన్న అమ్మవార్లను కొలిస్తే కోరిన కోరికలతో పాటు, అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయని అన్నారు. నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయం వద్ద ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవరాత్రులలో ఒక్కో రోజు విశేశాంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని జంపన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, అజిత్, జహంగీర్, మారుతి గౌడ్, నర్సింహా, నరేందర్, శ్రీకాంత్, మోను, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
నడుచుకుంటూ వెళుతూ మహిళను చూసుకొని బైక్ పై నుంచి చైన్ స్నాచర్ల బంగారు చైన్ ను తీసుకొని వెళ్ళారు
mmmmm
బాలా త్రిపుర సుందరి సూర్య అమ్మవారు ఇంద్రకీలాద్రి విజయవాడబాలా త్రిపుర సుందరి సూర్య అమ్మవారు ఇంద్రకీలాద్రి విజయవాడ
హోమ్ మినిస్టర్హోహోమ్ మినిస్టర్ అనిత బాల త్రిపుర సందేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్న హోమ్ మినిస్టర్
భవన నిర్మాణాలకు అనుమతులు, నిర్మించేది వ్యాపార సముదాయాలు.
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు.
అల్వాల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతున్న వాటిని నివారించే మున్సిపల్ శాఖ అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని పనులు ప్రారంబిస్తారు. గృహావసరాల పేరుతో అనుమతులు పొంది అటు తరువాత వ్యాపార సముదాయాలుగా మార్చుకుంటున్నారు. నిర్మాణ అనుమతులు ఇచ్చిన అనంతరం జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లేక పోవడంతోపాటు సంబంధిత అధికారులను మేనేజ్ చేసుకుంటూ నిర్మాణదారులు వారి పని కానిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టడం లేకపోవడంతో ఇదే తరహాలో ఇతరులు సైతం రెచ్చిపోతున్నారు. కమర్షియల్ అనుమతులు పొందాలంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి, అగ్ని మాపక దళం అనుమతి, విద్యుత్ శాఖ అనుమతి అవసరం. కానీ వీటన్నిటిని ఒకే చోట కలిపి సదరు భవన నిర్మాణదారులు ఒకేసారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. వీరికి అధికారుల అండదండలు ఉండటంతో యదేచ్చగా నిర్మాణాలు జరుపుతున్నారు.
ఆల్వాల్: వెంకటపురం శ్రీ పోచమ్మ టెంపుల్ ల్లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. మహాలయ అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మ సంబరాలు, ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు ఈ పండుగ వేడుకలో ఒక్కరోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు.. రోజు ఒక్కోరకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ అంటారు. చివరి రోజు జరుపుకునే పండుగను సద్దుల బతుకమ్మ అంటారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ సర్కిల్ 133వ డివిజన్ మచ్చ బొల్లారంలో డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో గాంధీ 155 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మైనంపల్లి మాట్లాడుతూ.. అహింసా మార్గం ద్వారా ఏదైనా సాధించవచ్చని మనం గాంధీ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా పారిశుద్ధ కార్మికులను మైనంపల్లి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం కాంటెస్ట్ కార్పోరేటర్ టిఎన్ సంజీవ్ కుమార్, రాష్ట్ర ఓబిసి నాయకులు చిత్రాల సంతోష్ సాగర్. మహిళ నాయకురాలు..శకుంతల నాయుడు, పద్మ, మరియు కాంగ్రెస్ నాయకులు సాయికుమార్, కేబుల్ కిట్టు, నందకుమార్, నిరంజన్, సుధీర్, రాజ్ కుమార్, కిరణ్, అంకుల్ విష్ణు, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ కార్మికులను కార్మికులను సన్మానించిన జంపన ప్రతాప్. నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస బాటలో నడవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ సూచించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ వద్ద కంటోన్ మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. అహింసే ఆయుధంగా ఆంగ్లేయులను గడగడలాడించి స్వాతంత్రం తెచ్చిన ఘనత మహాత్మా గాంధీకే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన అహింస మార్గంలోనే నడవాలని కోరారు. స్వచ్ఛ హి సేవ గాంధీ జయంతి సందర్భంగా బోయిన్ పల్లి సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ సిబ్బందిని జంపన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభు కుమార్ గౌడ్. మాల్యాద్రి. సాయిబాబా యాదవ్. బండిశ్రీను. ముఖేష్. వర ప్రసాద్. సిరాజ్. కుమార్. మధు. మౌలా. షకీబ్.సత్యనారాయణ. మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.