ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం
కొంపల్లి నారాయణ సిబిఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి. జి ఎం. గోపాల్ రెడ్డి, ఏ. జి. ఎం. పురుషోత్తం రెడ్డి, ప్రిన్సిపల్ భార్గవి పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ...దేశ అభివృద్ధి, భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.. యువతను మంచి మార్గంలో నడిపించి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యతని గుర్తు చేశారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్ర పోషించిన వారికి బహుమతులు అందజేశారు. తదనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ గంగాధర్ నేహా ప్రేమ కుమారి అంబిక తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
##ఉపాధ్యాయదినోత్సవం
Nice