వర్షాలు ఆగాలని రెండు .. ప్రదక్షిణలు ఎక్కువ.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఆగాలని భక్తులు మరో రెండు ప్రదక్షిణలు చేయబోతున్నారు చిలుకూరి బాలాజీ అర్చకులు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనికోసం వరుణుడు శాంతించి వర్షాలు ఆగాలని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వరుణుడు శాంతించాలని రెండు ప్రదక్షిణలు ఎక్కువ చేయాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. అలాగే వరద సహాయానికి అన్ని విధాల సహకరించిన వారిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ పూజారి సి ఎస్ రంగరాజన్ మాట్లాడుతూ.... రెండు తెలుగు రాష్ట్రాలు వరుణ దేవుని ఉగ్ర తీవ్రతను ఎదుర్కొంటున్నాయని, ఇటువంటి విపత్కర పరిస్థితులలో చిలుకూరి బాలాజీ మళ్లీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనల్ని మరింత విధ్వంసం నుండి రక్షించాలని ప్రార్థించడం జరిగింది. తుఫాన్, లాంటి మరిన్ని ప్రమాదాల నుండి మరిన్ని వర్షాలు పడకుండా జల ప్రళయం జరగకుండా సుదర్శన అష్టకష్టాలు పడకుండా గోవింద నామ స్మరణతో శక్తివంతమైన ప్రదక్షిణలు చిలుకూరులో నిర్వహించామని, సకల జీవుల భద్రత కోసం ప్రార్థనలు చేశామని చెప్పారు. వరదలు, విధ్వంసం, గాయం, విపత్తు, మరియు ఆకస్మిక మరణాల నుండి రక్షణ కోసం ... ప్రతికూల వాతావరణం కారణంగా సంక్షోభ సమయంలో గోవింద నామ స్మరణతో ప్రదక్షిణలు నిర్వహించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి సత్వర భక్తుల సహాయం కోసం విరాళాలు అందించాలని నిర్ణయించారు.
##చిలుకూరుటెంపుల్.