హైదరాబాద్ లో మొట్టమొదటిసారి రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి

7 Views· 25/09/24
Sidhu Maroju
Sidhu Maroju
Subscribers
0
In Health

నార్త్ హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చింది మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. ఈ ప్రముఖ అతిథిగా వర్త జయసుధ, మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ... తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజీలో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ సహజనటి జయసుధ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరం అన్నారు. మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన చికిత్స అందించడమే మా లక్ష్యం అని, మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల స్పెషల్ సర్జన్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సిలబస్ తో కొత్త కోర్సులను కూడా అందుబాటులోకి తెస్తామని కాలేజీ యాజమాన్యం ఇచ్చింది .
##రోబోటెక్నాలజీ

Show more

 0 Comments sort   Sort By