ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్
సికింద్రాబాద్ : బేగంపేట పీఎస్ పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తితో పాటు, ఇద్దరు విక్రేతలను అరెస్టు చేసినట్టు.. ఉత్తర మండల డిసిపి సాధన రశ్మి పెరుమాళ్ తెలిపారు. నిందితుడి నుండి 47 లక్షల విలువైన 59 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. రద్దీగా ఉండే మెట్రో రైల్వే, బస్‌ల పార్కింగ్ వద్ద నిలిపి ఉన్న వాహనాలను దొంగలించి ఇంజన్ నంబర్ తొలగించి, నకిలీ ఆర్సీలను సృష్టించి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల దొంగతనం కేసులో విడుదలైన సాయికుమార్... కేవలం 90 రోజుల్లో 59 ద్విచక్ర వాహనాలను అపహరించినట్టు చెప్పారు. గూడెం కు చెందిన సాయికుమార్ తో పాటు అదనంగా ఉన్న, జగదీష్, హరికృష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సులభంగా సంపాదించాలన్న ఉద్దేశంతో మూడు కమిషనరేట్ల మేరకు దొంగతనాలకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు పార్కింగ్ లో నిలిపి ఉంటే తమ వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ సూచించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సభ్యులకు రివార్డులను ప్రకటించారు.
##డీసీపీప్రెస్మీట్