ఉపాధ్యాయుల పాత్ర కీలకం: జంపన ప్రతాప్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోయిన్ పల్లి బాపూజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జంపన మాట్లాడుతూ... ఈ ఒక్కరోజు విద్యార్థులకు ఉపాధ్యాయులుగా అవకాశం వస్తుందని గుర్తుచేస్తూ... ఉపాధ్యాయులుగా పాల్గొన్న పాఠశాల విద్యార్థులకు బహుమతులు. పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రకీలకమని జ్ఞాన సంపన్నులైన అంకితభావం కలిగిన యువతను ఆ దేశ పాఠశాల కళాశాల కీలక దశల నుండే ఉపాధ్యాయులు కృషి చేస్తారన్నారు. జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్న మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను మరువకూడదన్నారు. ఈ కార్యక్రమంలో... హెడ్ మాస్టర్ ఆశీర్వాదం, పద్మావతి, సరితారాణి, శోభారాణి, హరినాథ్, అనితలు ఉన్నారు.
##ఉపాధ్యాయదినోత్సవం
Nice