అల్వాల్ ల్లోని పలు కాలనీలలో పర్యటించిన ఎంపీ
అల్వాల్ ల్లోని ఆనంద రావు నగర్ భరత్ నగర్, వాసవి నగర్, జానకి నగర్ చెరువు కింద ఉన్నవారికి నోటీసులు ఇవ్వడంతో వారిని కలిసి ధైర్యాన్ని నింపేందుకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు ఈటెల...కాలనీ వాసులతో మాట్లాడుతూ... నోటీసులు వచ్చాయని మీరు ఆందోళన చెందకండి. అందులో మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. ఇప్పటికే నేను హస్పత్ పేట చెరువు దగ్గర మాట్లాడాను. పేదవాళ్ల జోలికి వస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాను. కూలి పనులు చేసుకుంటూ.. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. నెల నెల బ్యాంకుల్లో రుణాలు కడుతూ 60-70. గజాలలో ఇల్లు కట్టుకున్న వెంటనే వారికి నోటీసులు పంపడం కూలగొట్టడం బాధాకరమైన అంశం అన్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకు వాళ్లు కూడా నోటీసులు ఇచ్చి కొంత అవకాశం కల్పిస్తారు. మీరు మాత్రం రాత్రి పగలు లెక్కచేయకుండా ఏ టైంలో అయినా పేదల ఇళ్లను కులగోడుతున్నారు. మేము కూడా ప్రజాక్షేత్రంలో 20 ఏళ్లుగా పనిచేసిన వాళ్లమే. వారి కష్టసుఖాలు గమనించిన వారిని. నేను మంత్రిగా పని చేసినప్పుడు నా హక్కులు ఏంటో బాధ్యతలు ఏంటో తెలుసుకుని పనిచేశాను. నువ్వు కూడా మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఏం చేసావ్.. అంటూ ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. అవుట్ సోర్సింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వారికి జీతాలు ఇచ్చే సోయి లేదు. మూసి పక్కన 12 00 ఇల్లు ఇస్తానని చెప్పావు,ఇంతవరకు ఇవ్వలేదు. చెరువు అంటే కన్నతల్లితో సమానం. కానీ చెరువులు ఈరోజు విషంతో నిండిపోయాయి. చెరువు ఏ వ్యవసాయం కింద ఉందో... ఎకలాజికల్ బ్యాలెన్స్ కింద ఉందో.... ఏ చెరువు మత్స్యకారులకు సంపద అవుతుందో..ఆ పర్పస్ ఇవాళ లేదు. నీకు జ్ఞానం ఉంటే విషపూరితమైన చెరువులను ముందుగా శుభ్రం చేయి. మిస్టర్ రేవంత్ రెడ్డి..నీకు ఆ పదవి ఎలా వచ్చింది! తెలంగాణ ప్రజలు నువ్వు మంచిగా పరిపాలిస్తావని నిన్ను నమ్మి ముఖ్యమంత్రిని చేశారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి నీది. కోర్టులు కూడా మీ పనులు తప్పుపడుతున్నాయి. కోర్టులు స్టే ఇస్తాయి. FTL లో ఇల్లు ఉండటం వాస్తవమే కావచ్చు. కానీ వాళ్లు ఎలా కట్టుకున్నారు! అవి FTl ల్లో కూడా తెలిసి ఎలా అధికారులు పర్మిషన్లు ఇచ్చారు! ఇవన్నీ పరిశీలించకుండా బుల్డోజర్లను పంపి ఇష్టం వచ్చినట్టు కూలగొడితే చూస్తూ ఊరుకోను... అంటూ ఈటెల హెచ్చరిక.70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 44ఏళ్లు పరిపాలించింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా!గతంలో ముఖ్యమంత్రిగారు ఏం చేశారు. అంటూ తీవ్రంగా. మీకు ఇచ్చిన నోటీసులను జిరాక్స్ కాపీ చేసి ఒకటి నాకు ఇవ్వండి. నన్ను గెలిపించింది, ఇంట్లో పడుకోవడానికి కాదు. మీ సమస్య నాది కాదా? నేను మీ తరపున పోరాడుతాను. సోషల్ మీడియా కోసం ట్రెండింగ్ కోసం మాట్లాడండి. ప్రజల కోసం "ఎవడ్రా " అంటాం. అయినా అలా మాట్లాడటం నాకు రాదు. కానీ.. పేద ప్రజలకు ఇబ్బందులు పెడితే మాత్రం ఊరుకోము. అంటూ తీవ్రంగా. ఈ కార్యక్రమంలో సి.మాణిక్య రెడ్డి.మల్లికార్జున్.కార్తీక్ గౌడ్. లక్ష్మణ్. అంతోని రవి. గోపి. అరవింద్ రెడ్డి.ప్రశాంత్ రెడ్డి. కాలనీల అధ్యక్షులు. మరియు బిజెపి నాయకులు ఉన్నారు.
##కాలనీలపర్యటన