గణనాథునికి ప్రత్యేక పూజలు
అన్నదాన వివరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కంటోన్మెంట్ ఒకటో వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మండపాల్లో జరిగిన పూజల్లో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఓల్డ్ ఎయిర్పోట్ రోడ్డు లోని టీటీడీ సాంస్కృతిక కళాశాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపం తో పాటు వాయు నగర్, కంసాలి బజార్, మలాని కాలనీ, బాపూజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆది దేవుడైన గణేశుడికి పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మోహన్, పవన్, వర.. తదితరులు పాల్గొన్నారు.
##గణేష్నవరాత్రులు