watermark logo

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

12 Views· 14/09/24
Sidhu Maroju
Sidhu Maroju
Subscribers
0
In Gaming

క్రీడలు భవిష్యత్తులో మానసిక ఆనందంతో పాటు జీవితంలో మనిషి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని అల్వాల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ దేవ్ అన్నారు. కమ్యూనిటీ వాలీబాల్ టోర్మెంట్ ను అల్వాల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గోల్నాక ప్లే గ్రౌండ్ లో SHO రాహుల్ దేవ్ శుక్రవారం ప్రారంభించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్రీడలు ఏర్పాటు చేయడం వల్ల పోలీసులతో స్థానికులతో స్నేహపూర్వక బంధం ఏర్పడింది. ఆటల వలన దేహ దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఇదో నాంది అవుతుందని, వ్యాయామంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, యువత ఎదుగుదల కోసం కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఈ పోటీల్లో.. పోలీస్ టీం, అల్వాల్ మీడియా టీం, లోతుకుంట టీం, గోల్నాక యూత్ క్లబ్, బాయ్స్ హై స్కూల్ ఓల్డ్ అల్వాల్, వైష్ణవి మాత టెంపుల్ టీం, కంటోన్మెంట్, అంబేద్కర్ నగర్ టీంలు పాల్గొన్నారు. పోలీస్ టీం, అల్వాల్ మీడియా టీం, మొదటి రెండు సెట్లలో చిరు సెట్ గెలిచిన ఫలితాన్ని తేల్చే మూడో సెట్ ఆడాయి. ఫైనల్ సెట్ లో మీడియా టీం కు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా అల్వాల్ ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ చేసిన సర్వీస్ బాల్స్ మీడియా టీం ను ఉక్కిరి బిక్కిరి చేసాయి . దీనికి తోడు ఎస్సై శంకర్ గౌడ్.. తనదైన శైలిలో షార్ట్‌లు కొడుతూ మంచి పాయింట్స్ రాబట్టాడు. అల్వాల్ మీడియా టీం కూడా ప్రతిఘటించిన ఫలితం లేకపోయింది. అల్వాల్ పోలీస్ టీం రెండు - ఒకటి తో విజేతగా నిలిచి కప్ ను కైవశం చేసుకుంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ... సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లలో ఇలా వాలీబాల్ టోర్నమెంట్లు చేస్తామని చెప్పారు. అల్వాల్ గోల్నాక ప్లే గ్రౌండ్‌లో నిర్వహించిన కమ్యూనిటీ వాలీబాల్ టౌ ర్ణ మెంట్‌లో ఉత్సాహంగా పది జట్లు పాల్గొన్నారు. ఉత్తమ ఆటను ప్రదర్శించిన ఎస్సై శంకర్ గౌడ్ కు మేనేజ్‌మెంట్ మ్యాచ్ మెమొంటోను డిసిపి కోటిరెడ్డి ప్రదర్శన. గోల్నాక యూత్ క్లబ్ కు.. ప్రైస్ మనీని ఏసీపీ రాములతో పాటు కలిసిడిసిపి వేదిక. ఈ కార్యక్రమంలో అల్వాల్ ఎస్హెచ్ఓ రాహుల్ దేవ్, ఎస్సై సురేష్, ఎస్సై శంకర్ గౌడ్. మరియు సిబ్బంది, గోల్నాక యూత్ క్లబ్ నిర్వాహకులు ఉన్నారు.
##టోర్నమెంట్

Show more

 0 Comments sort   Sort By