అట్టహాసంగా రాణా ప్రతాప్ యువసేన గణేష్ నిమజ్జనం
న్యూ బోయిన్ పల్లిలోని బాలుర పాఠశాల సమీపంలో గల విద్య గణపతి ఆలయ ఆవరణలో రానా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ నేతృత్వంలో నవరాత్రులలో పూజలు అందుకున్న గణనాథుడు మండపం నుండి భక్తుల జేజేల నడుమ అంబేద్కర్ చౌరస్తా, చిన్న తోకట్ట, యేడుగుల్లు, పెద్ద తోకట్ట, బాపూజీ నగర్ ద్వారా ... బోలో గణపతి మహారాజ్ కి జై, గణపతి పప్పా మోరియా.. భక్తి నినాదాల మధ్య అడుగడుగునా భక్తుల నిరాజనాలు అందుకుంటూ , యువతి యువకుల ఆనందోత్సాహాల మధ్య, మహిళా నేతలు డాన్స్ లు చేస్తూ శామీర్ పేట చెరువుకు తరలించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ..గణనాథుడి ఆశీస్సులతో నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పూజించామని తెలియజేశారు. అండ్ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులకు, విద్యుత్ సిబ్బందికి, కంటోన్మెంట్ బోర్డ్ శానిటేషన్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ కాంగ్రెస్నాయకులు, దండుగుల యాదగిరి,బిజెపి నేతలు భానుక మల్లికార్జున్, బి ఎన్ శ్రీనివాస్ తో పాటు జిపి యువసేన ప్రతినిధులు, రాము గౌడ్, గోపి, రవీందర్, జంపన రవి, పవన్, రాజేష్, సిరాజ్, చోటు, మౌలా, వరప్రసాద్ మధు శశి తదితరులు పాల్గొన్నారు.
##గణేష్నిమజ్జనం
Nice