నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు
బేగంపేట ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల నుండి నాలుగు లక్షల విలువైన నకిలీ మద్యాన్ని 180 మద్యం బాటిళ్లు మూతలు స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీ గోవా ప్రాంతాల నుండి మద్యాన్ని తీసుకువచ్చినట్టు నమ్మిస్తూ విక్రయిస్తున్నట్టు విచారణలో తెలింది. ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగన్నాథ సాహులు.. ఈవెంట్లకు మద్యాన్ని సరఫరా చేసే వారని తెలిపారు. ఖరీదైన మద్యం బాటిల్లలో మద్యం ఖాళీ అయిన వెంటనే ఆ ఖాళీ బాటల్లను ఇళ్లకు తీసుకువెళ్లి అందులో నకిలీ మద్యాన్ని పోసి తక్కువ ధరకే వినియోగదారులకు అమ్ముతున్నట్టు తేలింది. ఈవెంట్లు జరిపే వాళ్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు విచారణ లో తేలింది. మరియు వినియోగదారుల నుండి ఆర్డర్లు తీసుకుని వాటిని తక్కువ ధరలకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఈ నకిలీ మద్యాన్ని తరలిస్తున్న క్రమంలో బేగంపేట పరిసర ప్రాంతాల్లో వీరిని పట్టుకున్నట్టు తెలిపారు.
##నకిలీమద్యంపట్టివేత