పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి: జంపన ప్రతాప్
సికింద్రబాద్ కంటోన్మెంట్ 6 వ. వార్డు న్యూ బోయిన్పల్లి లోని రామన్న కుంట చెరువు వద్ద కంటోన్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమము నిర్వహించారు. ఇందులో భాగంగా కంటోన్ మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యులు.. పాండు యాదవ్, బీజేపీ నేత బి.ఎన్ శ్రీనివాస్ తో పాటు రక్షణ శాఖ దక్షిణ కమాండ్ డైరెక్టర్ అమూల్ ,బి..జగ్దాప్, కంటోన్ మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్, జాయింట్ సీఈవో పల్లవి విజయ వంశీ, హెల్త్ సూపరిండెంట్ దేవేందర్. సానిటరీ సూపరిండెంట్ మహేందర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ...బోర్డు అధికారులు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రజలను భాగస్వామ్యం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలు బోర్డు అధికారులకు సహకరిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలని చెత్తను రోడ్డుపై గాని, ఖాళీ స్థలాల్లో కానీ పారవేయవద్దని సూచించారు.
##పరిసరాలుపరిశుభ్రత.