సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. మహంకాళి బోనాలు ఉత్సవాలను ఘనంగా జరపాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ఆయన ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఇటీవల నెలకొన్న సమస్యలను పండుగ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు లక్షలాదిమంది ప్రజలు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 29న ఘటాల ఊరేగింపు, వచ్చేనెల 13 14వ తేదీలలో బోనాలు రంగం కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న టాయిలెట్లు సిసి రోడ్లు క్యూ లైన్ లను ఆయన పర్యవేక్షించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు.