మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గనికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కీ చెందిన లబ్ధిదారులు గంగాధర్ 60000, మహంకాళి శ్రీనివాస్ 26000, చంద్రకళ 30000, వినయ్ 51000, నాగమణి 42000 . ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న యాదవ్, నవీన్ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ మేరు తదితరులు పాల్గొన్నారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి కి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.