నగర పంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది

0
2

గూడూర్ నగరపంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు 

కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి 

మరియు రేపటి రోజున అనగా 27-06-2025 కుక్కలను పట్టి కర్నూల్ నందు స్టెరిలైజేషన్ చేయుటకు మరియు యాంటీ రాబీస్ వాక్సిన్ వేసి తిరిగి కుక్కలను యధావిధి స్థానంలో వదిలివేయుటకు కార్యాచరణ మొదలవుతుంది 

కావున ప్రజలు, మీడియా వారు సహకరించగలరు 

గమనిక:- రోజుకు 20 లేదా అంతకంటే ఎక్కువ పట్టుకుంటారని తెలియజేస్తున్నాం.కుక్కలను పెంచుకున్నారు దయచేసి కుక్కలను మీ ఇళ్లలో ఉంచుకోవాలని మరియు వారికి లైసెన్స్, యాంటీ రాబిస్ వాక్సిన్ పొందియుండాలి అని తెలియజేయడమైనది.