ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.

0
52

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న మురికి నీరు. మ్యాన్ హోల్ ఆనుకుని ఒక ఇండికేషన్ బోర్డు మాత్రం పెట్టారు.ఆ బోర్డు రోడ్డుని ఇంకా ఇరుకుగా చేసింది. అది ఇరుకైన చౌరస్తా. అక్కడ దీనివల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. నిరంతరం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇక పాదాచారులకు లెక్కే లేదు. ఆ ప్రాంతం నుండి వెళ్లేవాళ్లు ఆ మురికి నీటి దుర్వాసనను భరించలేక ముక్కు మూసుకుని వెళుతున్నారు. అసలే ఇది వర్షాకాలం. ఒకవేళ అనుకోకుండా వర్షాలు పడితే ఆ నీరు ఎక్కడికెళ్తుంది!?  దీనికి బాధ్యులైన సిబ్బంది వెంటనే స్పందించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు