South ZoneTelangana నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి టు బిహెచ్కె పత్రిక సోదరులు By Bharat Aawaz - 27 June 2025 0 5 FacebookTwitterWhatsAppLinkedinTelegram ఈరోజు 2 BHK ప్రెస్ క్లబ్ మిత్రులము అందరం కలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారితో 2 BHK కి సంబంధించినటువంటి సమస్యలను వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 2 BHK కి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా అలాగే ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు అందరి లబ్ధిదారులకు చేకూరే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. పత్రికా సోదరులంతా కలిసి మా వంతు ప్రయత్నం గా ఈ సమాజంలో సామాజికంగా అందరూ బాగుండాలి అలాగే ఎక్కడ కూడా అవినీతి జరగకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటి ని అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ చేకూరే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు.మా తరఫున మీకు ఏ విధమైన సహాయమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పత్రికా సోదరులు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టు బిహెచ్కె లో ఉన్నటువంటి పత్రిక సోదరులందరూ కూడా కలిసి రావడం శుభ పరిణామం.