అరకొర కేటాయింపులతో దగ,
ఇమామ్..మౌజాన్ ల గౌరవ వేతనంపై కూటమి సర్కార్ కుట్రలు
వైసీపీ నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
అరకొర నిధులు కేటాయించి ఏపీలోని ఇమామ్, మౌజాన్ లకు గౌరవ వేతనం ఇవ్వకుండా కూటమి సర్కార్ దగా చేస్తోందని వైసీపీ నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ విమర్శించారు. కూటమి సర్కార్ హామీలను నమ్మి ఓటేసినందుకు ఇమామ్ మౌజాన్ లను కూడా చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని ఏ వర్గం కూటమి సర్కార్ పాలనలో సంతోషంగా లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఏదో ఒక రూపంలో చంద్రబాబు సర్కార్ దగా చేస్తూనే ఉందని ఆయన విమర్శించారు. కానీ చంద్రబాబు సర్కార్ ఓ విషయం మర్చిపోతున్నారని, దగాకు గురైన ప్రతి వర్గం ఎన్నికలు ఎపుడొస్తాయా కూటమి సర్కార్ ను ఎపుడు ఓడించాలా అన్నది ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే జగన్ పాలన వస్తుందని ఇమామ్ , మౌజాన్ లకు గౌరవ వేతనం విషయంలో తప్పకుండా వైసీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.