చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య

0
5

పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే వివాహిత ఆత్మహత్య. మానసిక ఆరోగ్యమే ఆత్మహత్యకు కారణమని ప్రాధమికంగా నిర్దారించిన పోలీసులు.  గృహిణి అయిన కుమారి గత మూడు సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స కూడా తీసుకుంటుందని ఫిర్యాదు లో తెలిపిన కుటుంబ సభ్యులు.  మృతురాలు కుమారికి బురద ప్రసాద్ రావుతో 17 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ప్రశాంత్ కుమార్ (15), రియాన్షిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు….ఈ ఘటనపై చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….