మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. అల్వాల్ జొన్న బండ లో సర్వేనెంబర్ 22, 23 . 1980లో 12 ఎకరాల 21 గుంట స్థలంలో 142 ఫ్లాట్లు వెంచర్ గా చేసి లేఔట్ ప్రకారం ప్లాట్లు విక్రయించగా ఆ స్థలంలో ఇప్పుడు కొందరు ప్రైవేటు వ్యక్తులు “రాక్ ల్యాండ్ అవైనిగా వెంచర్” చేసి లేఔట్లు మార్చి కాంపౌండ్ వాల్ నిర్మించి గేటు ఏర్పాటు చేసి అపార్ట్మెంట్ ప్లాటుగా విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క భూమీ ఫ్లాట్ యజమానులు 45 ఏళ్లుగా పోరాడుతూ వయోవృద్ధులుగా మారిన వారి సమస్య పరిష్కారం కావడంలేదని గతంలో ప్రజావాణిలో కంప్లైంట్ చేసిన ఎమ్మార్వో ఆర్డీవో కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లిన ఉపయోగం లేదని ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి విన్నవించి.. మా తరఫున మీరు పోరాడాలని మా భూమి ప్లాటు మాకు ఇప్పించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే కలెక్టర్ గారిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.