రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రియల్ ఎస్టేట్ మన రాష్ట్రంలో ప్రధాన రంగం. మీరందరూ లక్షల కోట్ల టర్నోవర్ తో రాష్ట్ర, దేశ జీడీపీలో భాగస్వామ్యమవుతున్నారు. ప్రభుత్వాలు సరిగా సపందించకపోతే పని చేసే తృప్తి తపన ఉండదు. మీకు తోడు కావాల్సింది మంచి ఆలోచన ఉన్న ప్రభుత్వం. యువతకు ఉపాధి, పురోగమన కోణంలో ఆలోచించే ప్రభుత్వం ఉండాలనీ మీరు కూడా కోరుకుంటారు. మనదేశం అత్యంత ఎక్కువ యువశక్తి ఉన్నదేశం. 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి మీలాంటి వారి శ్రమ ఉంది. మోదీ గారు స్టేబుల్ ప్రభుత్వం అందిస్తున్నారు. రాష్ట్రాల సహకారం కూడా ఉండాలి. ఇక్కడ కూడా అలాంటి ప్రభుత్వం వస్తుంది అని హామీ ఇస్తున్నాము. ఈ రంగంలో లక్షలమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి పట్ల కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో మార్పులు చేర్పులు కోసం చర్చలు జరుగుతున్నాయి. వ్యాపారం చేసేవారిని దొంగలుగా చూడవద్దు అని నేను చెప్పిన, వేధింపులు ఉండకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందరూ పన్నులు కట్టే విధానం తీసుకురావాలని సూచించాను. జీఎస్టీ విధానం విజయవంతంగా అమలు చేస్తున్నాం.