గూడూరు మండల సింగల్ విండో అధ్యక్షులుగా గూడూరు ప్రముఖ టిడిపి నేత స్వర్గీయ బి కరుణాకర్ రాజు తండ్రి బి దానమయ్య ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మండలాలలోని సింగల్ విండో అధ్యక్షులుగా వివిధ సింగల్ విండోలకు చైర్మన్లను ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా గూడూరు మండల సింగల్ విండో అధ్యక్షులు గా గూడూరు మండల మాజీ రైతు సంఘం అధ్యక్షులు బి.దానమయ్యను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పదవి జిల్లా కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిల సహకారంతో తనకు ఈ పదవి వచ్చిందని సింగల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైన దానమయ్య తెలిపారు. అలాగే వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారు తమపై నమ్మకం ఉంచి ఈ పదవి “ ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గూడూరు సింగల్ విండో పరిధిలోని రైతులందరికీ సకాలంలో రుణాలు అందించ డానికి సహకారం అందిస్తానని రైతుల అభివృద్ధికి తన వంతు
సింగల్ విండో ఎన్నికైన అధ్యక్షునిగా దానమయ్య సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. తన కుమారుడు బి సహకారం అందిన ఎన్నో ఏళ్లుగా విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి సహకారంతో గూడూరు పట్టణ అభివృద్ధికి కృషి చేశారని అయితే కరోనా సమయంలో అకాల మృతి చెందడం జరిగిందని స్వర్గీయ కరుణాకర్ రాజు తండ్రిగా తనకు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లు ఈ పదవి ఇచ్చారని ఆయన తెలిపారు, కచ్చితంగా వారీ సహకారంతో గూడూరు సింగల్ విండో పరిధిలోని రైతులందరికీ నిరంతరం అందుబాటులో ఉండి కేడీసీసీ బ్యాంకు నుండి వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. అలాగే బి కరుణాకర్ రాజు కుమారుడు తన మనవడు బి సృజన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. సింగల్ బిండో డైరెక్టర్లుగా రేమట యు వెంకటేశ్వర్లు డి అల్లిపిరాలు ఎంపికైనట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సభ్యుల సహకారంతో గూడూరు సొసైటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సింగల్ విండో చైర్మన్ బి దానమయ్య తెలిపారు.