తనయుడి పుట్టినరోజు సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
6

 

 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ పుట్టిన రోజు సందర్భంగా న్యూ బోయిన్ పల్లి పెన్షన్ లైన్ లోని వాలీబాల్ గ్రౌండ్ లో శ్రీగణేష్ ఫౌండేషన్ తరపున ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కంటి ఆపరేషన్ల కోసం లయన్స్ ఐ హాస్పిటల్ మారేడ్పల్లికి రెండు లక్షల రూపాయల విరాళం కూడా అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. లయన్స్ క్లబ్ మరియు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంపు కు పెద్ద ఎత్తున హజరైన ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ ముకుల్ కు తమ ఆశీర్వాదం అందించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఖరీదయిన వైద్యం చేయించుకోలేని వారి కోసం ఉచితంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకోసం గానూ లయన్స్ ఐ హస్పిటల్ మారేడ్ పల్లికి రెండు లక్షల రూపాయల విరాళం కూడా అందజేసామని, హస్పిటల్ కు భవిష్యత్ లో కూడా అండగా ఉంటానని అన్ని రకాలుగా సహకరిస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. తను ఎమ్మెల్యే అయిన తరువాత సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించలేక పోతున్న కారణంగా ఇక నుంచి ఎస్జీఎఫ్ తరపున సేవా కార్యక్రమాల బాధ్యత తన కుమారుడు ముకుల్ తీసుకుంటున్నాడని ఎమ్మెల్యే తెలిపారు.  ఎమ్మెల్యే కుమారుడు ముకుల్ కూడా తండ్రే తనకు ఆదర్శమని ఆయన మార్గంలో నడుస్తూ ప్రజాసేవ లో చేస్తానని, తన తండ్రి మీద చూపిన ఆదరాభిమానాలు తన మీద కూడా చూపాలని సేవా కార్యక్రమాలను మరింత విసృతం చేయడానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ముకుల్ కు పలువురు నాయకులు, హెల్త్ క్యాంపు వచ్చిన ప్రజలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు..