మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి
బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చ్వల్ డిసేబిలిటీస్)లో ఇస్మాయిలీ కమ్యూనిటీ ఆధ్వర్యంలోని అగాఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం లో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అగా ఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు నిపిడ్ (NIEPID) వారితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛంద సంస్థ వారు చేపట్టడం అభినందనీయమని, దివ్యాంగులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న ఈ సంస్థలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని, తాను కూడా సొంతంగా మరియు ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందించి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
-సిద్దుమారోజు