బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
5

*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ బాలసరస్వతి నగర్ లో అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా వర్షపు నీటి భూమి లోకి పంపి భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంత పనులను ప్రారంభించడం జరిగింది. డివిజన్ పరిధిలో దాదాపు 11 లక్షల రూపాయలతో పూర్తి పనులు చేపట్టనుండగా దాదాపు 50 వేల రూపాయలతో బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంత చెయ్యనున్నారు. ఈ సందర్బంగా పలు సమస్యలను ప్రజలు కార్పొరేటర్ శ్రవణ్ దృష్టికి తేవడం జరిగింది. ముక్యంగా గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను రోడ్ల పై పడేసి వెళ్తున్నారని అన్నారు. వెంటనే స్పందించిన శ్రవణ్ అక్కడ సూచన బోర్డు ఏర్పాటు చేసారు. స్ట్రీట్ లైట్స్ సమస్యను చెప్పగా ఎలక్ట్రికల్ ఏ.ఈ వెంకటేష్ ను పరిష్కరించాలని సూచించడం జరిగింది. పోలీస్ పెట్రోల్ ను పెంచాలని ఎస్. ఐ శంకర్ ను చరవాణి ద్వారా కోరడం జరిగింది. బాలసరస్వతి నగర్ లో నాలా పనులను పూర్తి చేసినందుకు కాలనీ వాసులు కార్పొరేటర్ శ్రవణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో డి.ఈ మహేష్, ఏ.ఈ నవీన్, AMOH మంజుల, సానిటరీ  సూపర్వైజర్ శ్రీనివాస్, SFA గిరి, ప్రవీణ్ యాదవ్,షాలిని, నరేష్, అనురాధ, వెంకట్, సుభద్ర, శ్రీనివాస్, రవి, సుబ్బారావు మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు.