మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ కుత్బుల్లాపూర్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం నుండి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చిన ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నాయకులు,ప్రజల నుండి వచ్చిన ఆహ్వానాలు,వినతిపత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, కాలనీలు, బస్తిలాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంచార్జ్ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు సారథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
-సిద్దుమారోజు