బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు

0
8

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం.

బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం – వర్షంలో వాహనదారుల తంటాలు”  రైసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గం గంటపాటల పాటు నిరీక్షణ.  బొల్లారం రైల్వే గేట్ వద్ద రిపేర్ పనులు జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  వర్షం కారణంగా సమస్య మరింత జటిలమై, రిసాలబజార్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో దాదాపు 50 నిమిషాల పాటు భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా .. వర్షంలో వందలాది మంది బైక్ రైడర్లు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, పాదాచారులు  నిలిచిపోయారు.రైల్వే గేట్ వద్ద నిలిచిన వాహనాల క్యూలు కిలోమీటర్ ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు వర్షంలో తడుస్తూ నిరీక్షించాల్సి వచ్చింది. ప్రజలు, స్థానికులు, వాహనదారులు మాట్లాడుతూ…   ప్రతి సారి రిపేర్ పేరుతో ఇలాగే గంటల తరబడి నిలిపేస్తారు. వర్షం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నాం.ఇలాంటి పనులను ముందుగానే ప్రకటించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా పరిస్థితులు మళ్లీ రాకుండా రైల్వే గేట్ వద్ద శాశ్వత పరిష్కారం తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

    –Sidhumaroju