పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
13

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్.  

 

కంటోన్మెంట్ నియోజకవర్గంలో 62 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా 1,16,000 /- రూపాయలను అందిస్తుందని, ఈరోజు 62 కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయడం ఆనందంగా ఉందని,  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో నిరంతరం పర్యవేక్షించి చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా చూస్తున్నారని, అధికారులు కూడా నిబద్దతతో పనిచేస్తున్నారని తెలిపారు.

   -సిద్దుమారోజు