రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు

0
12

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :

 

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు  ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి, అక్కాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబించే ఈ సాంప్రదాయాన్ని ఎంతో సౌభ్రాతృభావంతో జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ…అమ్మాయిలు, మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభాలు. మహిళల రక్షణ, సంక్షేమం నా మొదటి కర్తవ్యం. ఈ రాఖీ నాకు ఆ బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది” అని పేర్కొన్నారు. అదే విధంగా రాఖీ పౌర్ణమి ప్రేమానుబంధాలకు, సహోదరత్వానికి ప్రతీక అని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ, ఆడబిడ్డలు తమ అన్నలకు జీవితాంతం అండగా ఉండాలని ఆశిస్తూ కట్టే రక్షాబంధనం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో సహోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు శ్రీదేవి, సూలోచన, సరిత, శారద దేవి,తో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

   – sidhumaroju