శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
6

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్ 

 

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ , బాలాజీ కాలనీ లలోని ఉప్పలమ్మ తల్లి,జడల మైసమ్మ తల్లి దేవాలయాలలో ఈరోజు శ్రావణ మాస బోనాలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం అమ్మవార్లను దర్శించుకుని, దేవాలయాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలందరూ అమ్మవారి అనుగ్రహంతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

     

  -sidhumaroju